సిబీఐకి కెవిపి వాంగ్మూలం

 

సిబీఐ కెవిపి రామచంద్రా రావును శనివారం విచారించింది. జగన్ తనని ఎప్పుడూ ఏదీ అడగలేదని, తన ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందలేదని చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. తాను ప్రభుత్వ సలహాదారుగా పనిచేశానని, ప్రభుత్వానికి సంబంధించి ఏ ఫైళ్ళూ చూడలేదని, ఎక్కడా తన పేరుతొ లావాదేవీలు, సంతకాలు ఉండవని, అడిగితే సలహా చెప్పేవాడినని, ఏదైనా అంశంపై సలహాలు కావలసి వచ్చినప్పుడు మాత్రమే తాను సమావేశాలలో పాల్గొనేవాడినని తెలిపారు. తానెప్పుడూ ప్రభుత్వ దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, ఫైళ్ళ వల్ల ఎవరెవరికి లాభం జరిగిందో తనకు తెలియదని, ప్రభుత్వం అడిగినప్పుడు మాత్రమే సలహాలు, సూచనలు ఇచ్సువాదినని, దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారో, ఆ సలహాలు అమలయ్యాయో లేదో కూడా తనకు తెలియదని, తాను రాజశేఖర రెడ్డికి సన్నిహితుడినే అయినా తనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని సిబీఐకి తెలిపినట్లు తెలిసింది.