కేవీపి సీబీఐకి జవాబు చెప్పుకోకతప్పదు: వీహెచ్

రాజ్యసభ సభ్యుడు కేవీపిని రేపు సీబీఐ విచారణకు పిలవడంతో, కాంగ్రెస్ పార్టీలో ఆయనను వ్యతిరేఖించే వారు ఒకరొకరుగా గొంతు విప్పుతున్నారు. అందరికంటే ముందుగా పార్టీలో సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావు స్పందించారు. కేవీపి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నపటికీ, ఆయన జగన్ మోహన్ రెడ్డి కి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమె భర్త మరణానికి తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీఏ కారణమని ఆరోపిస్తున్నపుడు కూడా ఆయన ఆమెను వారించకుండా మౌనం పాటించి పార్టీపట్ల, పార్టీ అధిష్టానం పట్ల అగౌరవం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో కేవీపి ప్రమేయం లేకుండా ఏపని జరుగలేదు. అటువంటప్పుడు అందరినీ విచారించినట్లే సీబీఐ ఆయనను కూడా ఇంతకు ముందుగానే విచారించి ఉండాల్సిందని” ఆయన అన్నారు.

 

జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐకు జవాబు చెప్పుకోవలసిన బాద్యత ఆయన మీద ఉందని అని ఆయన అన్నారు. పార్టీలో సీనియర్ అయినంతమాత్రాన్న ఎవరూ పార్టీకి, చట్టానికి అతీతులు కాబోరని ఆయన అన్నారు.