కాంగ్రెస్ లో మరో బిగ్ విక్కెట్ డౌన్

 

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగిలేలా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓడిపోయారు. చాలామంది సీనియర్ నేతలు ఓటమి అంచుల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ లో బిగ్ విక్కెట్ డౌన్ అయింది. పరకాల నియోజకవర్గంలో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో పరకాలలో టీడీపీ నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి ఈ సారి టీఆర్ఎస్ నుంచి పోటీచేశారు. కాగా, కొండా సురేఖ గత ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఈ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌ను వీడిన కొండా సురేఖ కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. భారీ మెజార్టీతో పరకాలలో కాంగ్రెస్ గెలుస్తుందని మొదట్నుంచి అనుకున్న అధిష్టానం ఆశలన్నీ ఆవిరయ్యాయి. చల్లా ధర్మారెడ్డి, కొండా సురేఖపై 40వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.