సీన్ రివర్స్.. ఓన్లీ రెబల్స్... కొల్లాపూర్ లో జూపల్లి వర్గం హవా!!

కొల్లాపూర్ లో టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ గుండెల్లో గుబులు రేపారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బరిలో దిగిన జూపల్లి వర్గం కొల్లాపూర్లో సత్తా చాటుతోంది. తమ అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడంతో జూపల్లి వ్యూహాత్మకంగా వారిని రెబల్స్ గా బరిలోకి దింపారు. కేటీఆర్ చెప్పినా జూపల్లి వెనక్కి తగ్గలేదు. తన అనుచరులను సింహం గుర్తుతో పోటీ చేయించారు జూపల్లి. ఇప్పుడు కొల్లాపూర్ లో జూపల్లి వర్గం నేతలే సత్తా చాటుతున్నారు. మొదటి నుంచి ఈ ప్రాంతం లో జూపల్లికి పట్టుంది కానీ జూపల్లిని కాదని పార్టీలో చేరిన హర్షవర్ధన్ రెడ్డి వర్గానికి టిక్కెట్ ఇవ్వగా.. తమ అనుచరులను కూడా జూపల్లి బరిలోకి దింపారు. ప్రస్తుతం చూస్తున్న ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థులు కంటే రెబల్ అభ్యర్ధులే కొల్లాపూర్ లో అధిక స్థానాలను గెలుస్తున్నారు. 

ధర్మపురి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ అక్కడ 8 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందితే 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించింది. వీరి మధ్య గట్టి పోటీ ఏర్పడిన వాతావరణం కనిపిస్తుంది.సిటీ శివారు ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య నువ్వా నేనా అని గట్టి పోటీ నడుస్తొంది.కొన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్ధులు  గెలిస్తే మరో పలుచోట్ల బీజేపీ అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇండిపెండెంట్లు కూడా విజయాన్ని కైవసం చేసుకుంటున్నారు.మొత్తం మీద ఎన్నికల ఫలితాలు పార్టీ నేతల మధ్య గట్టి పోటీ వాతావరణం ఏర్పడింది.