ఖబర్ లహరియా

 

 

పట్టుదల ఉండాలే కాని సాధ్యం కానిది ఏది వుండదు. చేయాలనీ సంకల్పించాలే కాని ఏవి ఆటంకాలు కావు. ఈ మాటలని రుజువు చేశారు కొంతమంది మహిళలు ఏంటో వెనకబడ్డ ప్రాంతం కనీస వసతులు, సౌకర్యాలు లేవు. నిరక్ష్యరాస్యత ముఖ్యంగా పురుషాధిక్యత ఎక్కువ- అలంటి ఓ జిల్లా నుంచి వచ్చిన కొంతమంది మహిళలు కలసి ఓ పత్రిక నడుపుతున్నారు అంటే నమ్మగలరా? కాని నిజం ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసే కధనాలు, వారికీ అవసరపడే సమాచారం సేకరించడం నుంచి పత్రిక డిజైన్ చేయటం,ప్రింట్ చేయటం, తిరిగి దానిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళటం దాకా అంతా పూర్తిగా మహిళల చేతుల మీదుగానే జరుగుతుంది. తమకు ఏ మాత్రం పరిచయం లేని రంగం అయినా పట్టుదలతో,ధైర్యంతో ముందుకు సాగిపోతున్నఆ మహిళలు నడిపే పత్రిక గురించి పూర్తి వివరాలు తెల్సుకుందాం.

 

ఉత్తర ప్రదేశ్ లోని సుమారు నమరు నాలుగొందల గ్రామాల్లోని ప్రజలకు అక్షర జ్ఞానం అందించటమే కాదు, వారిని చైతన్య వంతులని చేస్తోంది."  ఖబర్ లహరియా" ఖబర్ లహరియా అంటే బుందేలీ భాషలో " నవతరంగాలు " అని అర్ధం. ఈ ఖబర్ లహరియలో ఆరోగ్యం,విద్య, ఉద్యోగావకాశాలు, పంచాయితీ సమస్యలు- పరిష్కారం ఇలా విభిన్న అంశాలు కధనాలుగా వస్తాయి. బాల్యవివాహాలు గృహహింస, మహిళల హక్కులు, మూడనమ్మకాలు, వంటి  వాటిపై ప్రజల్లో  చైతన్యం తీసుకువచ్చే దిశగా కధనాలు రూపొందించటం వీరి ప్రత్యేకత. వార్తల సేకరణలో, కధనాలు రూపొందించడంలో ఎక్కడా రాజీవుండదు. " ఖబర్ లహరియా" లో ఓ వార్త వచ్చినా, విశ్లేషణ వచ్చినా అది ఖచ్చితంగా  నిజమని నమ్ముతారు ప్రజలు.

" ఖబర్ లహరియా " లో అంతా మహిళలే ఎనిమిది సంవత్సరాల క్రితం ఎనిమిది మందితో ప్రారంభమయ్యి ఇప్పుడు పదిహేనుమంది మహిళలు దాని నిర్వహణ భాద్యతలు చూసుకుంటున్నారు,వీరంతా పెద్దగా చదువుకోలేదు పత్రికలో చేరాకా హిందీ, ఆంగ్ల భాషల్లో శిక్షణ తీసుకున్నారు. ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమైన వీరు పత్రిక నిర్వహణ భాగంగా గ్రామాల్లో తిరుగుతారు.విలేకరులుగా మారుమూల ప్రాంతాల్లోని వార్తలని సైతం సేకరిస్తారు. ప్రభుత్వ అధికారులతో రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు చేస్తారు.వీరి పనితీరు కూడా పక్కగా వుంటుంది. వరం రోజుల్లో ఓ రోజు సమావేశం అవుతారు. ఏ కధనాలు చెయ్యాలిఎవరెవరు ఏం చెయ్యాలో నిర్ణయించుకుంటారు. ఇక రిపోర్టింగ్, ఇంటర్వ్యూలు కధనాలు ఏవైనా మూడ్రోజుల్లో సిద్దం ఆ తరువాత పేజీల రూపకల్పన ప్రింటింగ్, వాటి ప్రజలకు చేర్చటం అంతా ప్రణాళిక ప్రకారం  జరిగిపోతుంది. అసలు ఇలాంటి పత్రిక ప్రారంభించాలనే ఆలోచన ఎవరిదో తెలుసా ?

ఉత్తర ప్రదేశ్ లో సుమారు నాలుగొందల గ్రామాల దాకా నిరక్షరాస్యతతో వెనకబడి వున్నాయి అక్కడ మూడనమ్మకాలు ఎక్కువే బాల్య వివాహాలు, గృహహింస వంటివి మహిళల జీవితాన్ని నరకప్రాయం  చేస్తున్నాయి. వీటన్నిటిపై పోరాటాన్ని సంధించింది డిల్లికి చెందినా ' నిరంతర్' అనే  ఓ స్వచ్చందసంస్థ. ప్రజలని చైతన్య వంతులని చేయాలనే ముందు వారిని అక్ష్యరాస్యులుగా చేయటం ముఖ్యమని గ్రహించింది.ఆ దిశగా   అడుగులు వేస్తు అక్కడి కొంతమంది మహిళలకు హిందీ,ఇంగ్లీష్లలో వార్తల  సేకరణ ముద్రణ వంటి వాటిల్లో నిపుణులతో తర్ఫీదుని ఇప్పించి ఓ పత్రిక ప్రారంభించింది ఆ పత్రిక ద్వారా చిత్రకూట్,బాందాల్లోని ఇరవై వేల విద్య,శాస్త్ర,సాంకేతిక రంగాల్లో కృషి చేసే వారికీ యునెస్కో ఏటా ఇచ్చే ' కింగ్సేజాంగ్'  అవార్డు ని గత సంవత్సరం  ఈ ఖబర్ లహరియా' స్వంతం చేసుకుంది. ఇది అచ్చం గా మహిళలు సాధించిన విజయం. ఎందుకంటే ఏంటో వెనకబడ్డ ప్రాంతం నుంచి వచ్చి అక్షరాలను  నేర్చుకుంటూనే ఓ పత్రిక నిర్వహణ చేపట్టడం మాత్రమే కాదు, రాత్రనక, పగలనక మాములు గ్రామాల్లోకి సైతం వార్తల సేకరణకూ వెళ్ళటం, ఆ కష్టనష్టాలకి ఓరుస్తూ గత ఎనిమిదేళ్ళుగా పత్రికని విజయవంతంగా నడపటం సామాన్యమైన విషయమా చెప్పండి ...

విజయాలు మనల్నిఎంతో ఉత్సాహపరుస్తాయి ఏదో ధైర్యాన్ని నింపుతాయి " ఖబర్ లహరియా" వెనక వున్న మహిళల విజయం కూడా అంతే. పరిస్థితులు, విద్య, వంటివి ఏవి మనం సాధించాలనుకునే వాటికీ ఆటంకం కాదని నిరూపించిన విజయమది. ఏ చిన్నపాటి అవకాశం దొరికినా మహిళల్లో అంతర్గతంగా ఉండే శక్తితో అద్భుతాలు సృష్టించగలరాణి మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన నిజమిది .

                                       ........రమ