భోజనం చెయ్యి.. 20 వేలియ్యి

 

 

 

మన రాష్ట్రంలో కేసీఆర్, హరీష్ రావు లాంటి టీఆర్ఎస్ నేతలు ఆమధ్య కూలిపని చేసి, టీ కొట్టులో పనిచేసి వేలకు వేలు, లక్షలకు లక్షలు జీతాలు సంపాదించారు.. గుర్తుందా? గమేళాలో ఒకే ఒక్క ఇటుక పెట్టుకుని దాన్ని నాలుగడుగులు తీసుకెళ్లి ‘కూలీ‘ చేసినందుకు కేసీఆర్ అప్పట్లో 20 వేలు సంపాదించేశారు. సరిగ్గా ఇదే మంత్రాన్ని బెంగళూరులో ఓ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు జపిస్తున్నారు.

 

నిన్నటి వరకు ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేసి, ఇప్పుడు ఆమ్ ఆద్మీగా మారిన బాలకృష్ణన్ అక్కడో విందు ఏర్పాటుచేశారు. దీనికి అరవింద్ కేజ్రీవాల్ కూడా వస్తారు. అక్కడ భోజనం చేయడంతో పాటు పార్టీ విధానాల గురించి ఏం అడిగినా కేజ్రీ సమాధానాలు చెబుతారు. ఇంతకీ విందుభోజనం ఖరీదు ఎంతో తెలుసా.. అక్షరాలా 20 వేల రూపాయలు మాత్రమే.


ఇలా ఒక్కో విందు ద్వారా 4 లక్షలు సంపాదించాలన్నది ఆ పార్టీ లక్ష్యమట. ఇలాంటి ఫండ్ రెయిజింగ్ డిన్నర్స్ అమెరికన్ రాజకీయాల్లో మామూలే. కానీ ఆమ్ ఆద్మీలకు అందని ద్రాక్షల్లాంటి ఇలాంటి విందుల వల్ల ఏం లాభమని ఆప్ వ్యతిరేకులు విమర్శిస్తున్నారట.