మహా నాయకుడు KCR హత్యకు కుట్ర

 

 

 

తెలంగాణా జాతి పిత, త్యాగశీలి, మహానాయకుడు తెరాస అధ్యక్షుడు KCRని హత్య చేయడానికి కుట్ర జరుగుతుందని హరీష్ రావు ఆందోళన చెందుతున్నారు. కానీ... KCRని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది?

KCR ని హత్య చేస్తే....

1.  సెపరేట్ తెలంగాణా ప్రక్రియ ఆగిపోదు.

2. తెలంగాణా ఉద్యమం ఆగిపోదు.

3. అసలు డిల్లీ పెద్దలు సెపరేట్ తెలంగాణా ఏర్పాటు గురించి KCRని సంప్రదించడమే లేదు. అది! ఆయనకున్న ఇంపార్టేన్స్.

4. ఇక ఉద్యమం విషయానికి వస్తే.... ప్రస్తుతం తెలంగాణా ఉద్యమం KCR చేతిలో లేనే లేదు.

5. సెపరేట్ తెలంగాణా ఒకవేళ ఏర్పడిన దానికి ముఖ్యమంత్రి KCR కానే కాడు. అంతే కాదు... అతని కుటుంబ సభ్యులు ఎవ్వరికీ తెలంగాణా ప్రభుత్వంలో ఏ రకమైన పాత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదు.


మరి KCR ని హత్య చేసే అవకాశం ఎవరికి ఉంటుంది?

సీమాంధ్ర వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఈ మధ్య KCR అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దానివల్ల వచ్చే తెలంగాణా రాష్ట్రం కూడా రాకుండా పోతుందని తెలంగాణా నాయకులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణా రాష్ట్రం చేజారిపోతే అది KCR వల్లే చేజారిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

మరి KCR ని హత్య చేసే అవసరం ఎవరికి ఉన్నట్లు...?