కేసీఆర్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మేల్యేలతో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో చేసిన తీర్మానాన్ని సమర్పించనున్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 1.30కు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. కేసీఆర్ తో పాటు కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.