కిర‌ణ్‌పై నిప్పులు చెరిగిన కెసిఆర్‌

 

తెలంగాణ ప్రక‌ట‌న త‌రువాత చాలా రోజులు మౌనం పాటించిన కిర‌ణ్‌ నిన్న ఒక్క సారిగా నోరు విప్పారు అంతేకాదు తాను అసలు సిలైన స‌మైక్యవాదినంటూ త‌న మాట‌ల‌తో చెప్పక‌నేచెప్పారు. అయితే సియం మాట‌లు ఎలా ఉన్న ఆయ‌న మాట‌ల దుమారం మాత్రం రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేస్తుంది. కిర‌ణ్ కుమార్ రెడ్డి మాట‌ల‌పై ఆయ‌న సొంత పార్టీ నుంచే తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు ఎదుర‌వుతున్నాయి.

అయితే కిర‌ణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య ల పై ప్రెస్ మీట్ పెట్టి మ‌రి స్పందించారు తెలంగాణ రాష్ట్ర స‌మితీ అధ్యక్షుడు కెసిఆర్‌. రాష్ట్ర విభజన ప్రకటనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిందన్న కెసిఆర్ కిరణ్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమ‌ర్షించారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు కిర‌ణ్‌కు లేదన్న ఆయ‌న విభజన ప్రకటన వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ పరిస్థితి ఏంటని కిరణ్ ప్రశ్నించడం హాస్యస్పదం అన్నారు.

అంతేకాదు సియం చెప్పిన లేక‌ల‌పై తాము బ‌హిరంగ చ‌ర్చకు సిద్దం అన్న ఆయ‌న సియం అందుకు రెడీ నా అన్ని స‌వాలు విసిరారు.క‌రెంటు, నీళ్లు లాంటి విష‌యాల‌ను చెప్పి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రజ‌ల‌ను భ‌య‌పెట్టే ప్రయ‌త్నం చేస్తున్నార‌న్న కెసిఆర్, రాష్ట్ర ఏర్పడితే అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతామ‌ని తెలంగాణ ప్రజ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు.