కారు లేని కేసిఆర్

 

 

 

కారు గుర్తు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రియల్ లైఫ్ లో సొంత కారు లేకపోవడం ఆశ్చర్యకరంగా వుంది. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన సందర్బంలో తెలంగాణలో ఆయా పార్టీలకు చెందిన నేతలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. కెసిఆర్ ఆస్తి మొత్తం రూ.14.94 కోట్ల రూపాయలు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులు రూ.7.87 కోట్లు వరకు ఉందని పేర్కొన్నారు. 2012-13లో రూ. 6,59,684 ఆదాయాన్ని అర్జిస్తే, 2013-14లో రూ. 8,67,830 ఆర్జించినట్లు ఆదాయ పన్నుల రిటర్న్‌లో కేసీఆర్ పేర్కొన్నారు.