కేసిఆర్ హైదరాబాద్ ర్యాలీలో మార్పులు

 

 

 

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ ఈ రోజు రాష్ట్రానికి చేరుకోనున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్దమవుతున్నారు. రాష్ట్రవిభజన తరువాత తొలిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్న కేసిఆర్ స్వాగతం పలకడానికి వివిధ జిల్లాల నుండి వేల సంఖ్యలో కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే కేసిఆర్ ఢిల్లీ నుంచి రానున్న విమాన౦ ఆలస్యం కావడంతో విజయోత్సవ ర్యాలీ టైంలో మార్పులు చేశారు. మధ్యాహ్నం 2:45 గంటలకు కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకునే అవకాశముందని సమాచారం. సాయంత్రం 4గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ఆయన ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశముందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. 

 

బేగంపేట నుండి విజయోత్సవ ర్యాలీలో కేసీఆర్ పాల్గొంటారు. గన్‌పార్క్ వరకు ఆయన ర్యాలీ కొనసాగుతుంది. గన్‌పార్క్ చేరుకున్న ఆయన అక్కడ అమరవీరుల శ్ధూపాలకు ఘన నివాళులు అర్పించనున్నారు. తర్వాత అక్కడ నుండి తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఇంటికి బయల్దేరుతారు.