ఇదేమి న్యాయం కేసీఆర్ చిన్నానా? రేణుక

 

ఇంతవరకు తెలంగాణా ఉద్యమంలో తెరాస అధ్యక్షడు కేసీఆర్ అయన కుటుంబం సభ్యులనూ ప్రశ్నించేవరెవరూ లేరనేచేప్పాలి. తెలంగాణా ఉద్యమానికి కేసీఆర్ ఏకఛత్రాధిపత్యం వహిస్తుండగా, ఆయన కుమారుడు కేటీఅర్, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావు ఆయన సైన్యాధికారువలె పనిచేస్తున్నారు. అయితే, త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలు, వారి కుటుంబములో నివురు గప్పిన నిప్పుల దాగిఉన్న కలహాలను బయట పెట్టింది.

 

ఈ ఎన్నికలలో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నకేసీఅర్ అన్నగారు మధుసూధనరావు, తన తమ్ముడు తనను పక్కనపెట్టి నిన్నగాక మొన్నవచ్చిన స్వామిగౌడ్ ను ఈఎన్నికలలో చంకనెత్తుకోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. అదేవిధంగా అయన కుమార్తె రేణుక కూడా చిన్నాన కేసీఆర్ మీద కోపంతో రగిలిపోతున్నారు. నిన్నవారిరువురూ మీడియా వారితో మాట్లాడుతూ స్థానికుడయిన స్వంత అన్నను కాదని, స్థానికేతరుడు, అవినీతుపరుడు అయిన స్వామిగౌడ్ కు మద్దతు ప్రకటించడం తప్పు పట్టారు.

 

“అనేక కేసులో ఇరుకొని, అనేక అక్రమాలకి పాల్పడిన స్వామిగౌడ్ కు కేసీఆర్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియదు. స్థానికుడయిన నాన్నగారిని కాదని స్థానికేతరుడయిన స్వామిగౌడ్ కు ఏకారణంగా మద్దతు ఇస్తున్నారో ఆయనే చెప్పాలి. నేను స్వామిగౌడ్ అవినీతి గురించి ప్రజలకి చెప్పి,ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా ప్రజల మద్దతుతో మా నాన్నగారిని తప్పక ఈ ఎన్నికలలో గెలిపించుకొంటాను.”