ప్రగతి భవన్‌లో కేసీఆర్ చర్చలు... ఏం జరగబోతుంది..?

ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి అజయ్ తో పాటు ఆర్టీసీ, ఆర్టీఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈరోజు కోర్టులో సమ్మెపై విచారణ జరగబోతుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై చర్చిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎంవో ఇవాళ మరో ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజెయ్ తో పాటు ఇతర రవాణాశాఖ అధికారుల తోటి సమీక్ష నిర్వహిస్తామన్నారు.

ఈ సమీక్షలో ప్రధానంగా ఈరోజు కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా ఏం అభిప్రాయం చెప్పాల్సిందనేటువంటి కోణంలోనూ చర్చ జరుగుతుందన్న సమాచారం. దీంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు కోర్టులో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏంటి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని కూడా కోర్టు సూచించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యం లోనే ఎండి నియామకం పై కూడా ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేపట్టారు అనేది కూడా కోర్టుకు వివరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇరవై ఒకటో తేదీ కల్లా కార్మికుల సెప్టెంబర్ నెల జీతాలకు సంబంధించి కూడా కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులు మంత్రితోటి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.