ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదట.. కర్ణాటక హోం మంత్రి

అమ్మాయిలపై జరిగే అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంత మంది రాజకీయ నేతలు బుక్కవుతుంటారు. గతంలో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నలుగురు అబ్బాయిలు కలిసి అత్యాచారం చేయలేరని, ఒకరు రేప్ చేస్తే మిగిలిన అందరి పేర్లూ పెట్టేస్తారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కర్ణాటక హోం మంత్రి కేజే జార్జి కూడా అదే తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లో  22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిని  కదులుతున్న వ్యానులో అత్యాచారం చేసిన ఘటనపై మీడియా ప్రతినిధులు కేజే జార్జిని ప్రశ్నించగా దానికి ఆయన ఇద్దరే మగవాళ్లు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని.. కనీసం నలుగురైదుగురు కలిసి చేస్తేనే దాన్ని గ్యాంగ్ రేప్ అనాలి తప్ప, ఇద్దరు చేస్తే అది ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. కేజే జార్జి చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలపై జరిగుతున్న అఘూయిత్యాల గురించి ఒక ప్రజానాయకుడు ఇలా మాట్లాడటం సరికాదని.. మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని అన్నారు.