విశాఖలో విహారం.. పర్యాటకుల కోసం మరింత ముస్తాబవుతున్న కంబాలకొండ!

 

విశాఖ నగరానికి ఆనుకుని చుట్టూ కొండలు ఉంటాయి. ఇందులో చాలా వరకు రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అందులో అతిపెద్ద ప్రాంతం ఏదైనా ఉందంటే అది కంబాలకొండ రిజర్వు ఫారెస్ట్. ఇటు నగరానికి అటు మధురవాడ ప్రాంతానికి మధ్యలో ఉంటుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా మార్చారు. పర్యాటకులు వచ్చేందుకు అనుగుణంగా దీనిని మలిచారు. ఆరంభంలో అడపా దడపా పర్యాటకులు వస్తుండేవారు. నగరవాసులకు.. విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు కొన్ని ట్రెకింగ్ ట్రాక్స్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పర్యావరణ స్ఫూర్తిని నింపే యాత్రలా దీన్ని మలిచారు. నగర వాసులు విద్యార్థులు వివిధ కార్పొరేట్ గ్రూపులు ఇక్కడ శని ఆదివారాల్లో ఎక్కువగా వస్తారు. ఇందులో రెండు కిలో మీటర్లు, మూడు కిలో మీటర్లు, ఐదు కిలోమీటర్ల ట్రాక్ లుంటాయి. ఇందులో ఒక్కొక్క ఏజ్ గ్రూప్ కు అన్నట్టు ఉంటాయి. దారులు కూడా చాలా బాగుంటాయి. ఉదయాన్నే వచ్చి ట్రెకింగ్ కు వెళ్లే వారు ఎక్కువ మంది ఉంటారు. 

కంబాలకొండ రిజర్వు ఫారెస్ట్ సుమారుగా 17,000 ల ఎకరాల్లో కేంద్రీకృతమై ఉంది. 1770 లో ప్రభుత్వం రిజర్వు ఫారెస్టుగా ప్రకటించింది. ఇందులో కొన్ని రకాల జింకలు, దుప్పులు కొన్ని రకాల పక్షులు ఉంటాయి కానీ బయటకు కనిపించవు. ఎకో టూరిజం పేరుతో సందర్శకులకు అవకాశం కల్పించి కొన్ని పక్షులు జంతువులను ఏర్పాటు చేశారు. అయితే వాటి సంరక్షణ కరువవడంతో వదిలేశారు. దీనిమీదనే ఆధారపడిన సంబువానిపాలెం గ్రామస్థులే ఇందులో పనిచేస్తుంటారు. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అండర్ లో ఉంటుంది. సాధారణ రోజుల్లో ఇక్కడకు చాలా తక్కువ మంది పర్యాటకులు వస్తారు. కార్తీక మాసం వస్తే పర్యాటకులతో కిటకిటలాడుతోంది. కుటుంబాలతో సహా వాలిపోతారు. వచ్చే వారంతా చాలా బాగుందంటూ కితాబిచ్చేస్తారు. 

రెండు సంవత్సరాల క్రితం కంబాలకొండలో ఒక ఎడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రారంభించారు. అక్కడకు వచ్చే పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తూ వాటిని ఎంజాయ్ చేస్తారు. అక్కడ రేగలగడ్డ రిజర్వాయర్ అనే రిజర్వాయర్ తో పాటు వరసలో మరో రెండు చిన్న రిజర్వాయర్ లు కూడా ఉన్నాయి.వర్షాలు కురిసినప్పుడు ఇందులోకి ఆ నీరు వచ్చి చేరుతుంది. అందులో బోటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కంబాలకొండ స్పెషల్ ఎట్రాక్షన్ ఏవైనా ఉన్నాయంటే అవి అడ్వెంచర్ స్పోర్ట్స్ అందులో బర్మా బ్రిడ్జ్, జిప్ లైన్, స్కైవాక్, గో టు వాక్, టైర్ వాల్. టైర్ వాల్ లాంటివి ఇక్కడకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకోవడమే కాదు వారిని సాహసం చేసేలా చేస్తుంది. ఈ సాహసాలు చేసేందుకూ ధైర్యంతో పాటుగా మైండ్ కాన్సన్ ట్రేషన్ టెక్నికల్ లాజిక్ అప్లై చెయ్యాల్సుంటుంది. మెయిన్ గా ఫిజికల్ ఫిట్ నెస్ కూడా ముఖ్యం. ఇక్కడకు వచ్చే వారిలో ఎక్కువ మంది బర్నా బ్రిడ్జి, జిప్ లైన్ పై సాహసం చేస్తారు. చేసిన వారంతా వావ్ సూపర్ అంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సెంచరీస్ డెవలప్ చేయటానికి ప్రభుత్వం ఈ మధ్యనే నిర్ణయం తీసుకుంది. గతంలో వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తో మరిన్ని డెవలప్ చేసేందుకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ చర్యలు చేపట్టింది. ఇదే ప్రాంతంలో నైట్ సఫారీ మరికొన్ని అడ్వెంచర్స్ పెట్టే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.