కర్ణాటక కంబల హీరో శ్రీనివాస గౌడకు సీఎం అభినందనలు

కర్ణాటకలోని ఉడిపి మంగళూరులో నిర్వహించిన సాంప్రదాయ క్రీడ కంబళ పోటీలలో బోల్టును మరిపించాడు శ్రీనివాసగౌడ. 28 ఏళ్ల అతనికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. అయితే SAAI నిర్వహించే ట్రైల్స్ లో ఇప్పుడే పాల్గొన లేనని చెప్పిన శ్రీనివాసగౌడ.. దానికి కొంత సమయం కావాలని కోరాడు. ప్రస్తుతం కర్ణాటకలో కంబళ టోర్నమెంట్ సాగుతోంది. అందులో తను మరిన్నీ ఘనతలు సాధించాలని అనుకుంటున్నట్టు తెలిపారు కంబాళ పోటీదారుడు. అందుకే SAAIని ఒక నెల గడువు కావాలని కోరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు శ్రీనివాస గౌడ. 

కంబాళ, అథ్లెట్స్ పాల్గొనే ట్రాక్స్ రెండూ వేరువేరుగా ఉంటాయని ట్రాక్స్ లో వేళ్ల మీద పరిగెత్తితే కంబాలలో మడమల మీద పరిగెత్తుతాము అంటున్నాడు శ్రీనివాసగౌడ. తాను ఇంతగా ప్రఖ్యాతి పొందుతానని ఎప్పుడూ అనుకోలేదు అన్నారు కంబాళ హీరో. ఇటువంటి కీర్తిని సాధించటంలో దున్నపోతులదే కీలక పాత్ర అని వెల్లడించారు. అంతేకాకుండా తనను ఉసేన్ బోల్ట్ తో పోలుస్తున్నారని ఆయన ప్రపంచ చాంపియన్.. తాను కేవలం బురద, వరిపొలాల్లో పరుగెత్తేవాడిని అని వినయంగా వెల్లడించారు. 

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప అభినందించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించి గౌడను శాలువాతో సత్కరించి మూడు లక్షల రూపాయల నగదు బహుమతిని అందించారు. దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన న్యూస్ ఛానెల్స్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు శ్రీనివాసగౌడ. కాగా తన కోసం వచ్చిన న్యూస్ ఛానెల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు శ్రీనివాస గౌడ.