పరిటాల కుటుంబానికి సానుభూతి తెలిపిన జేసి సోదరులు!

 

అనంతపురం జిల్లాలో రెండు బలమయిన రాజకీయ వర్గాలకు చెందిన పరిటాల, జేసి సోదరుల మద్య ఉన్నరాజకీయవైరాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పరిటాలరవి హత్య తరువాత అతని అర్దాంగి సునీత ఈ ముఠా కక్షలు, రాజకీయాల పట్ల నిరాసక్తత చూపడంతో క్రమంగా ఆ రెండు కుటుంబాల మద్య ఉన్న కక్షలు కూడా కనుమరగవుతూ వచ్చాయి.

 

వారం రోజుల క్రితం పరిటాల శ్రీరామ్ మీద పోలీసులు హత్యాప్రయత్నం కేసు నమోదు చేయడం, తదనంతర పరిణామాలను గమనిస్తున్న జేసి సోదరులు, మొన్న మొట్ట మొదటిసారిగా పెదవి విప్పేరు. జేసి దివాకర్ రెడ్డి సోదరుడయినా ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో మీడియా వారితో మాట్లాడుతూ పరిటాల కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేసారు.

 

“పరిటాల సునీతా భర్తను పోగ్గొట్టుకొని ఒంటరిగా పిల్లలని పెంచి పెద్ద చేసి మంచి చదువులు చెప్పిస్తోంది. ఆమె కష్టాలు ఆమెకున్నాయి. ఆమె కొడుకు శ్రీరామ్ కూడా ఇంకా చిన్న పిల్లవాడు. రాజకీయాలలోకి రావాలని అత్రపడుతున్నాడు. గానీ, అతనికి సరయిన వయసు అనుభవము రెండూ లేవు. అందువల్ల అతను ఆచితూచి అడుగేయడం మంచిదని నా అభిప్రాయం. మంచి భవిష్యత్ ఉన్న ఆ పిల్లాడి విషయంలో అందరూ కలిసి కూర్చొని ఏదోవిదంగా సమస్యని సర్దుబాటు చేసుకొంటే మంచిదని మా అభిప్రాయం” అని అన్నారు.

 

చాలాకాలం తరువాత జేసి సోదరుల నోటినుండి ఈవిదయిన సానుభూతి పలుకులు విన్న జిల్లా ప్రజలు మొదట ఆశ్చర్యపోయినా స్వాగతించేరు. రెండు బలమయిన వర్గాలు జిల్లాలో శాంతి సామరస్యాలు కోరుకొంటే ప్రజలకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది?