హోరాహోరీ పోరు.. జనగామలో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది మునిసిపాలిటీల కౌంటింగ్ దాదాపు పూర్తయ్యింది. మరి కొన్ని ఫలితాలు మాత్రమే వెలువడాల్సిన అవసరాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ తొమ్మిది లో మాత్రం టీఆర్ఎస్ హవా మాత్రం జోరుగా కొనసాగుతోంది. జనగామలో దాదాపు 13 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వర్దన్నపేట 8 స్థానాలను కైవసం చేసుకుంది. నర్సంపేట 16 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే పరకాల దాదాపు క్లీన్ స్వీవ్ అంటే 22 స్థానాలకు 17 స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. 

మహబూబాబాద్ లో కూడా మొత్తం 36 స్థానాలకు 18  స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే తొర్రూరులో 15 స్థానాలకు మొత్తం 11 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ లెక్కన చూస్తే దాదాపు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక విధంగా అన్ని చైర్ పర్సన్ అభ్యర్ధులను గెల్చుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనగామలో కూడా ఇప్పటి వరకు కొంత హోరాహోరిగా సాగింది. కానీ టీఆర్ఎస్ మాత్రం ముందంజలో ఉంది. జనగామలో మాత్రం టీఆర్ఎస్ 13 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 10 స్థానాలను గెలుచుకుంది.. బిజెపి 4 స్థానాలు గెలుచుకోగా.. ఇండిపెండెంట్ అభ్యర్ధులు మాత్రం మూడు స్థానాలను గెలుచుకున్నారు.