సీమాంధ్ర ఎన్నికల బరిలో ‘జనసేన’

 

 

 

'జనసేన' తరఫున కొన్ని చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది. పొట్లూరి వరప్రసాద్‌తోపాటు మరో ఆరుగురిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఏడుగురు అభ్యర్థులు పవన్‌తో భేటీ అయి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం లోగా నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం.

 

పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇస్తూనే, జనసేన తరఫున స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. మల్కాజ్‌గిరిలోకూడా లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు తన మద్దతు ఉండబోతుందని నిన్న బెంగుళూరులో పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే పొట్లూరి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేమిటీ, సంవత్సరాలా కొలది జైల్లో ఉన్నవాళ్లు బయటకు వచ్చి పోటీ చేస్తున్నప్పుడు పొట్లూరి ఎందుకు పోటీ చేయకూడదని ఆయన ప్రశ్నించిన విషయం విదితమే.



బుధవారం ఉదయం పొట్లూరితో సమా పలువురు జనసేన నేతలు పవన్ కల్యాణ్‌కు కలుసుకుని స్వతంత్ర అభ్యర్థులుగానే ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పినట్లుగా సమాచారం. వారు చెప్పినటువంటి ప్రతిపాధనలన్నింటికి పవన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఈరోజు పవన్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.