Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైష్ణో దేవికి 1800 కేజీల గోల్డ్
posted on: Mar 25, 2021 2:50PM
జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ వైష్ణోదేవి దేవాలయానికి గత 20 ఏళ్లలో 1,800 కేజీల బంగారం విరాళంగా వచ్చిందని సమాచారహక్కు చట్టం ద్వారా తెలిసింది. బంగారంతోపాటు 4,700 కిలోల వెండి, రూ.2000 కోట్ల నగదు ఆలయానికి అందాయని వెల్లడైంది. సామాజిక కార్యకర్త హేమంత్ గునియా స.హ చట్టం కింద చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వర్షాకాలం రానున్న తరుణంలో ఆలయ బోర్డు ఈ డబ్బును సందర్శకులకు వసతులు కల్పించేందుకు ఉపయోగించాలి. ఈ ఆదాయాన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్మాణానికి కూడా ఉపయోగించవచ్చు’ అని హేమంత్ గునియా తెలిపారు. ఆలయానికి భక్తుల తాకిడి గతేడాది భారీగా తగ్గిందని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలిసింది. కరోనా కారణంగా 2020లో కేవలం 17 లక్షల మందే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు అని తెలిపింది. .


.jpg)



