కరోనాకు మతం రంగు పులమకండి: ముహమ్మద్ రఫీఖ్ 

* ఏపీ జమాఅతె ఇస్లామి హింద్ అధ్యక్షుడి విజ్ఞప్తి 

ప్రపంచ దేశాలు కరోనా ఉపద్రవానికి అల్లల్లాడుతున్నా కూడా  భారత ప్రభుత్వం ఏ విధమైన  ముందస్తు చర్యలు చేపట్టకుండా మార్చి 19 వరకు నిమ్మకు నీరెత్తినట్లు గా ఉండి‌ అకస్మాత్తుగా  లాక్ డౌన్ ప్రకటించడం వలన అనేక సమస్యలు తలెత్తాయని ఏ పీ జమాఅతె ఇస్లామి హింద్ అధ్యక్షుడు ముహమ్మద్ రఫీఖ్ పేర్కొన్నారు.

"ప్రభుత్వం ఇదే లాక్ డౌన్ ని మార్చి పదో తేదీనుండే అమలు పరచి ఉంటే ఢిల్లీ లో మత పర ప్రార్ధనలు జరిగేవే కావు,ఈ వైరస్ ఇంతిలా వ్యాపించేది కాదు. అలాగే ఢిల్లీ వార్తల పై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి , ప్రజలు ప్రత్యేకించి నెటిజన్లు వాస్తవ సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలి," అని కూడా ఆయన సూచించారుఇప్పుడు  కేవలం  నిజాముద్దీన్  పేరు  మాత్రమే  ఎందుకు, అని ఆయన ప్రశ్నించారు. 

ఇండియాలో  కూడా  కరోనా  వైరస్  వ్యాప్తి  చెందకుండా జాగ్రత్తలు  తీసుకోవటం  మొదలుపెట్టారు , హఠాత్తుగా  లాక్  డౌన్ ప్రకటించటం  జరిగింది . ఈ  లాక్  డౌన్  జరిగినప్పుడు  ఒక  రాష్ట్రం  వారు  వేరే  రాష్ట్రంలో  ఉన్నారు. వీరు  ఇప్పుడు  ఏం చేయాలి ? వీరిని  తమ  తమ  ప్రదేశాలకు  పంపించే  బాధ్యత  ప్రభుత్వంది  కాదా ? ఢిల్లీ  తబ్లిగ్   నిజాముద్దీన్ లో  వందల మంది చిక్కుకుని ఉన్నారు !  లాక్ డౌన్ ప్రకటనకు ముందు జరిగిన కార్యక్రమం అదీను సంవత్సరాలుగా  జరుగుతున్న ఆధ్యాత్మిక  కార్యం , మరి  ఢిల్లీ  ప్రభుత్వం  వారిని  పంపే  ప్రయత్నం  ఏం  చేసిందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ నిజాముద్దీన్  విదేశాల  నుండి  వచ్చిన  వారు  కూడా  ఉన్నారు !   ఇది సంవత్సరాలుగా  జరుగుతున్న కార్యక్రమం,దేశంలో ఇంకా ఎన్నో మతాల ఆధ్యాత్మిక కార్యక్రమాలూ జరిగాయి,  అన్ని  ప్రదేశాలలో  వ్యాపారం  రీత్యా , ఉద్యోగం  రీత్యా , పర్యటన రీత్యా  అనేక  మంది  విదేశాల  నుండి  వచ్చిన వారు  ఉన్నారు. ఇది  పెద్ద  నేరంగా మీడియా ఎందుకు  చూపిస్తుంది ? దేశంలో  ఎన్ని  కరోనా  కేసులు  ఉన్నాయి ? అందరూ  నిజాముద్దీన్  వెళ్లి  వచ్చిన  వాళ్లేనా? 

అమెరికా  లాంటి  దేశంలో  కరోనా  తాండవిస్తుంది   నిర్మూలించటానికి  అన్ని  రకాల  ప్రయత్నాలు  జరుగుతున్నాయి . కరోనా  ఇప్పుడు  పూర్తి  ప్రపంచ సమస్య దీనిని  దేశాలు  మతాలకతీతంగా  పోరాటం  చేయవలసిన  సమయం . నిజాముద్దీన్  పేరు  ముందు  పెట్టి  మత  రాజకీయాలు  చేయటం  వలన   దేశం  నుండి  కరోనాను  పారద్రోలగలమా ? మేధావులు  ఆలోచించాలి. 

తబ్లీగి  జమాత్  ఒక  ఆధ్యాత్మిక  సంస్థ , మానవులను  సృష్టికర్తతో కలపటానికి  ప్రయత్నిస్తున్న  జమాత్  అటువంటి జమాత్ పై మీద  సోషల్  మీడియాలో  విమర్శలు చేయటం  ఎంత వరకు సబబు ? తబ్లీగి  జమాత్  బాధ్యులు  మొదటి నుండే  ప్రభుత్వాన్ని  కోరుతున్నారు  ఇక్కడ ఉన్న  వారందరిని  సురక్షితంగా  తమ  తమ  ప్రదేశాలకు  పంపమని? హఠాత్తుగా  లాక్  డౌన్  ఎవరి  నిర్ణయం ? కేసులు  ఎవరి  మీద  పెట్టాలి ? ఈ  రకంగా  చూస్తే  ప్రపంచం  మొత్తంలో  ఎంత మందికి  కరోనా  ఉంది ? ఎంత మంది ప్రాణాలు  కోల్పోయారు ఎంత  మంది  మీద  కేసులు పెట్టాలి అని ఆయన ప్రశ్నించారు. కరోనా  విజృంభిస్తున్న  సమయంలో   ఒక  వర్గానికి  చెందిన  నిజాముద్దీన్ వారిపై   సోషల్  మీడియాలో  విషం  చిమ్మటం ఎంతవరకు  సబబు! కఠినమైన కరోనాకు లేని మతవిభజన మనుషులమైన మనకు అవసరమా ప్రతి  భారతీయుడు ఆలోచించాలని ఆయన కోరారు.