జైల్లో జయలలిత డ్యూటీ.. ధూప్‌స్టిక్స్ మేకింగ్

 

అక్రమ ఆస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు, 100 కోట్ల జరిమానా శిక్ష పడిన  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం బెంగుళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో వున్నారు. జైల్లో వున్నవారు నిబంధనల ప్రకారం ఏదో ఒక పని చేయాల్సి వుంటుంది. జైలు అధికారులు జయ తనకు ఇష్టమైన పని చేయవచ్చునని టైలరింగ్ సెక్షన్, కూరగాయలు కోయడం.. లేదా తనకు నచ్చిన ఏ ఇతర పని అయినా చేయవచ్చని సూచించారు. మొదట జయలలిత ఏ పనీ చేయకూడదని అనుకున్నప్పటికీ చివరికి ధూప్ స్టిక్‌లు చుట్టే పని చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. జైల్లో తీరిగ్గా వున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ధూప్ స్టిక్‌లను అనుభవజ్ఞులు తయారు చేసినట్టుగా చక్కగా చకచకా చుట్టేస్తున్నట్టు తెలుస్తోంది. జయలలిత శ్రద్ధగా చుట్టిన ధూప్ స్టిక్స్‌ని ఏ దేవుడి దగ్గరైనా వెలిగిస్తే, ఆ దేవుడు కరుణిస్తే అప్పటికైనా ఆమెకు బెయిల్ వస్తుందేమో చూడాలి.