మినహాయింపులు చెల్లవు... సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్

 

అక్రమాస్తుల కేసు విచారణలో ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు ఏపీ సీఎం జగన్. సీబీఐ కోర్టు వద్ద బందోబస్తుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ సీఎం హోదాలో తొలి సారిగా సీబీఐ కోర్టుకు ఈరోజు హాజరుకాబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణ పోలీసులకు ఒక లేఖ అందింది. ఏపీ ముఖ్యమంత్రి రేపు సీబీఐ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రిక్వస్ట్ లెటర్ అందటం జరిగింది. ముఖ్యంగా గత వారం సీబీఐ కోర్టులో ఇన్ కెమేరా ప్రొసీడింగ్స్ జరిగాయి. ఇన్ కెమేరా ప్రొసీడింగ్స్ జరిగిన నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా కోర్టు విచారణకు హాజరు కాకుండా ప్రతిసారి ప్రతి మినహాయింపు పొందుతున్నారు.

ఇలాంటి మినహాయింపులు చెల్లవని.. నెక్స్ట్ వీక్ తప్పని సరిగా వీరిద్దరూ కోర్టుకు హాజరు కావాలని చెప్పి సీబిఐ కోర్టు ఆదేశించింది. అయితే గత రెండు నెలల క్రితం వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ మోహన్ రెడ్డి తరపున దాఖలైన పిటిషన్ ను సీబిఐ కోర్టు తోసి పుచ్చటం జరిగింది. అప్పటి నుంచి కూడా హైకోర్టుకు వెళ్లకుండా ప్రతి శుక్రవారం నాడు ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని పెట్టుకుని ఆ ప్రభుత్వ కార్యక్రమాల్లో తాను హాజరు కాబోతున్నాడు కాబట్టి ఈ సీబిఐ విచారణకు హాజరుకావట్లేదన్న వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు కేసు విచారణకు జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. విజయ సాయిరెడ్డి మాత్రమే రెండు మూడు సార్లు రావడం జరిగింది. వీటన్నింటిని సీబిఐ కోర్టు పరిశీలించిన తర్వాత జగన్ మోహన్ రెడ్డిని తప్పని సరిగా కోర్టు విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించడం జరిగింది.