ఏపీలో కార్మికులకు వరాల జల్లు కురిపిస్తున్న జగన్ సర్కార్.....

 

ఏపీలో ఆర్టీసీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది జగన్ సర్కార్. ఇప్పటికే సంస్థను ఆర్టీసీ విలీనం చేసిన ప్రభుత్వం తాజాగా వెయ్యి కోట్లతో కొత్త బస్సులను కొనాలని నిర్ణయించింది. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. ఆర్టీసీ బలోపేతం పై నిఘా పెట్టింది ఏపీ సర్కార్. సంస్థల్లో కొత్త బస్సులను కొనాలని నిర్ణయించారు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పాడైపోయిన బస్సుల స్థానంలో మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కొత్త బస్సులు తీసుకువాలని నిర్ణయించారు.

ఇందు కోసం వెయ్యి కోట్ల టాంబ్ లోన్ తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిన్న అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ బలోపేతంపై చర్చించారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేల సాయం, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం పది వేలకు పెంచాలని నిర్ణయించారు. నిపుణుల కమిటీ సూచనలతో ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. డిసెంబర్ ఇరవై ఒకటిన వైఎస్సార్ నేతన్న హస్తం పేరుతో పథకం ప్రారంభించనుంది. మరోవైపు లా కోర్సులు చేసి కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టే జూనియర్ లాయర్ లకు నెలకు ఐదు వేల స్టైఫండ్ ఇచ్చేందుకు ఓకే చెప్పింది జగన్ సర్కార్  .

బార్ అసోసియేషన్ లో నమోదైన మూడేళ్లలోపు ఉన్న జూనియర్ లాయర్లకు ప్రోత్సాహం ఇవ్వనుంది ప్రభుత్వం. మరోవైపు హోంగార్డుల జీతాలను నెలకు పధ్ధెనిమిది వేలు నుంచి ఇరవై వేల మూడు వందలకు పెంచేందుకు కేబినెట్ ఒప్పుకుంది.ఆర్టీసీ బలోపేతానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి జగన్ సర్కార్ కార్మికుల మనసు దోచుకుంటోంది అనే చెప్పుకోవాలి. ఇవి కేవలం మాటలకే పరిమితమవుతాయా లేక నిజంగా చేతల్లోకి వస్తాయా అనేది మాత్రం వేచి చూడాలి.