అమిత్ షాతో జగన్ భేటీ... ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు ఆహ్వానం


ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. కడప జిల్లాలో ఈ నెల 23న జరగనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ శంకుస్థాపనకు ప్రధాని మోదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆహ్వనించాలని నిర్ణయించారు. అయితే అమిత్ షా అపాయింట్‌మెంట్పై గతంలో లాగే దోబూచులాట చోటు చేసుకుంది. షా పిలుపు కోసం అర్ధరాత్రి దాకా జగన్ వేచి చూసినా ఫలితం లభించలేదు.. మధ్యాహ్నం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లోక్ సభలో వైసీపీ పక్ష నేత మిథునరెడ్డి అమిత్ షాను కలిశారు. జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరగా.. రాత్రి 10 తర్వాత తన నివాసానికి రావలసిందిగా ఆయన సూచించినట్టు తెలిసింది. రాత్రి 10:30 గంటలకు అమిత్ షాను జగన్ కలుస్తున్నారని మీడియాకు సమాచారం అందింది. సాయంత్రమే జగన్ ఢిల్లీకి చేరుకున్నారు రాత్రి పది గంటల సమయంలో సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అమిత్ షా నివాసానికి వెళ్లారు. ఆయన కార్యాలయ వర్గాలు జగన్ కు అపాయింట్ మెంట్ పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిర్దిష్టమైన సమయం కూడా ఇవ్వలేదు, ప్రవీణ్ ప్రకాష్ నుంచి ఫోన్ రాగానే షా నివాసానికి బయలుదేరాలని జగన్ కూడా ఎదురు చూశారు. కానీ అర్ధ రాత్రి వరకు వేచి చూసినా ఇదే పరిస్థితి కనిపించింది.

ప్రవీణ్ ప్రకాష్ కూడా అమిత్ షా నివాసం నుంచి తిరిగి వచ్చిశారు. దీంతో అపాయింట్ మెంట్ లేనట్లేననీ బహుశా ఇవాళ సమయం ఇవ్వవచ్చుననే అంచనాకు వచ్చారు. జగనకు అక్టోబర్ 21వ తేదీన కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన ఆ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చినప్పటికీ అమిత్ షాను కలవలేకపోయారు. మరుసటిరోజున అది కూడా అమిత్ షా పుట్టిన రోజున ఆయనను కలిసి శుభాకాంక్షలు మాత్రమే చెప్పగలి గారు. ఇక శుక్రవారం ఉదయం జగన్ ప్రధానిని కలిసి ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు వచ్చే నెల ( డిసెంబర్ ) 9వ తేదీన అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభానికి రావాలని ఆహ్వానిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే అమీషా అపాయింట్ మెంట్ పైన స్పష్టత కోసం వేచి చూస్తున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా ఖరారైంది. నిన్న అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా కార్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు హాజరయ్యారు. ఆ తర్వాత తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు ప్రధానిని హోంమంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించి వారి అపాయింట్ మెంట్ కోరుతూ అభ్యర్థినులు పంపారు. అనంతరం జగన్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. అంతకుముందు కియా కార్ల పరిశ్రమ ప్రారంభోత్సవలో జగన్ కాస్త ముభావంగా కనిపించారు. తన ప్రసంగాన్ని కూడా 3 నిమిషాల్లో ముక్తసరిగా ముగించారు.

అనంతపురం పర్యటనలో ఉండగానే తన ఢిల్లీ టూర్ ను ఖరారు చేసుకున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉందా అనే చర్చ మొదలైంది. కాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీకి తాను ఏనాడూ దూరం కాలేదని ఇటీవల వ్యాఖ్యానించారు. అమిత్ షా అంటే తనకిష్టమని వైసీపీ నాయకుడు మాత్రం భయమని ఎద్దేవా చేశారు. పవన్ ను తాము పట్టించుకోవడమే లేదని రాజకీయంగా గుర్తించడం లేదని మంత్రులు వైసీపీ నేతలు అంటూనే ఆయన పై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. ఇదే సమయంలో కడప ఉక్కు శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లడం ప్రాముఖ్యం సంతరించుకున్న విషయంగా చెప్పుకోవచ్చు.