జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ప్రయోగం సక్సెస్

 

జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 రాకెట్‌ ప్రయోగం విజయం సాధించింది. గురువారం ఉదయం శ్రీహరికోట షార్‌ అంతరిక్ష కేంద్రం నుంచి పొగలుచిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 3,735 కిలోల క్రూమాడ్యూల్‌ (వ్యోమగాముల గది)ని125 కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం కోసం ఇస్రో దాదాపు 155 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ రాకెట్‌ ఎత్తు 43.43 మీటర్లు, బరువు 630.58 టన్నులు. ఈ ప్రయోగం ద్వారా మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియలో ఇస్రో మరో మెరుగైన ముందడుగు వేసింది. రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌, శాస్త్రవేత్తలు ఉత్సాహంగా ఉత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయోగాల్లో ఇది గుర్తుంచుకోదగిన రోజని అన్నారు. అందరి కృషి ఈ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిందని చెప్పారు.