బ్రిటీష్ ప్ర‌ధానిగా రిషి సునక్‌కు అవ‌కాశం ద‌క్క‌నుందా?

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం ద‌క్కుతుందా? ప‌్ర‌స్తుతం ఆర్థిక‌శాఖా మంత్రిగా రిషి సునక్ వున్నారు.   భారత సంతతికి చెందిన రిషి సునక్‌... బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో జన్మించారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి... 2015 ఎన్నికల్లో యార్క్‌షైర్ రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అచ‌లంచ‌లుగా ఎదుగుతూ  బ్రిటన్ ఆర్ధికమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు ప్ర‌ధాన‌మంత్రి అయ్యే అవ‌కాశం వుంది.  

39ఏళ్ల రిషి సునక్... ఆక్స్‌‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్‌ పట్టాలు అందుకున్నారు. ఆ తర్వాత స్టాన్ ఫర్డ్‌ వర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత పరిచయం కావడంతో... ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారడంతో 2009లో వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు.

అయితే, రిషి సునక్ రాజకీయాల్లోకి రాకముందు పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ సచ్ కంపెనీలో విశ్లేషకుడిగా సేవలు అందించారు. ఇక, ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లోనూ రిషి సునక్ డైరెక్టర్ గా ఉన్నారు.

బ్రిటీషుకు కరోనాదెబ్బ త‌గ‌ల‌డంతో ఆ దేశ‌ప‌గ్గాలు ఇండియ‌న్స్ చేతికి వ‌చ్చాయి. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు ఇండియా ని పాలించారు.. అని విన్నాం. 200ఏళ్ల తర్వాత ఇండియన్ బ్రిటిష్ ని పాలించ బోవడం చూడబోతున్నాం. రాణి, రాజు, ప్రధాని, ఆరోగ్య మంత్రి అందరూ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు బ్రిటన్ పగ్గాలు, ఫైనాన్స్ మినిస్టర్ రిషి సునక్, హోమ్ మినిస్టర్ ప్రీతి పటేల్, బిజినెస్ మినిస్టర్ అలోక్ శర్మ గారి చేతుల్లో పడ్డాయి..  

ఇప్పుడు బ్రిటన్‌లో భార‌తీయుల‌దే పెత్త‌నం. పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది మరి. దాదాపు 200 సంవత్సరాల పాటు భారత్‌ను తమ చేతుల్లో పెట్టుకొని.. మన దేశ సంపదనంతా దోచుకోవడంతో పాటు ఎంతోమంది అమాయకపు ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న బ్రిటీష్‌ వారిని ఇప్పుడు భారతీయులే దిక్కయ్యారు. కరోనాతో ఆ దేశ రాణి (కోవిడ్ వచ్చినట్లు వార్తలు వచ్చినా.. అధికారికంగా ప్రకటించక లేదు), యువరాజు, ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక ఇలాంటి సమయాల్లో సాధారణంగా గ్రేట్ బ్రిటన్‌ను ఇంఛార్జ్ చేసే అవకాశం ఛాన్సలర్ ఆఫ్ ఎక్సెక్వర్‌ గానీ.. హోమ్ సెక్రటరీగానీ తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్న ఇద్దరు(రిషి సునక్‌, ప్రీతి పటేల్‌) భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం.

ఈ నేపథ్యంలో ఓ మెసేజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. 300 సంవత్సరాల తరువాత సూర్యుడు అస్తమించని దేశాన్ని భారతీయులు పరిపాలిస్తున్నారు అని. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో రాబర్ట్ క్లైవ్‌, క్వీన్ విక్టోరియా, విన్‌స్టన్‌ చర్చిల్ ఆత్మలు సమాధుల్లో తిరుగుతూ ఉంటాయని కామెంట్ పెడుతున్నారు.