బిగ్ బాస్ కాంట్రవర్సీ....అనవసరమైనదేనా ?

 

బిగ్ బాస్ తొలి రెండు సీజ‌న్స్ ప‌ద్ద‌తిగా సాగిపోయాయి. చిన్న కాంట్రవ‌ర్సీ కూడా లేకుండా అయిపోయాయి. కానీ మూడో సీజ‌న్ మాత్రం ప్రారంభానికి ముందే  ఎన్నో వివాదాల‌కు తావిస్తుంది.  బిగ్ బాస్ తొలి సీజన్‌తోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఆయన కూడా అద్భుతంగా హోస్ట్ చేయడంతో తెలుగు టీవీ చరిత్రలోనే అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో ఈ షో దూసుకుపోయింది. 

ఇక రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సీజన్ 100 రోజులపాటు సుధీర్ఘంగా సాగింది. హౌజ్‌లో మసాలా, గొడవలతో మొదటి సీజన్‌ను మించి హైలైట్ అయ్యింది.  మూడో సీజన్  జులై 21 నుంచి ‘బిగ్ బాస్’ షో ప్రసారం కానున్నట్టు ఇప్పటికే ప్రోమో వీడియో ఒకటి స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతోంది. ఇప్పుడు ఆ షో నిడివి, సెలబ్రిటీల సంఖ్యను ఖరారుచేస్తూ స్టార్ మా ఛానల్ ట్వీట్ చేసింది. 

100 రోజులపాటు ఈ షో కొనసాగనుంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. అయితే గత రెండు సీజనల సమయంలో బ‌య‌టికి రాలేదో లేక ఏమో కానీ ఇప్పుడు ఈ షో మీద సెక్స్ ఆరోపణలు వస్తున్నాయి. 

సినీ పరిశ్రమ వరకే పరిమితమైన లైంగిక వేధింపులు ఇప్పుడు ‘బిగ్ బాస్’లోకి కూడా వచ్చాయని శ్వేతా రెడ్డి ఆరోపిస్తోంది. తాను బిగ్ బాస్ హౌజ్‌లోని అడుపెట్టాలంటే తమ బాస్‌ను ఇంప్రస్ చేయాలని ఒక కో ఆర్డినేటర్ తనను అడిగాడని ఆరోపిస్తూ ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లైంగిక వేధింపుల కింద ‘బిగ్ బాస్’ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

తాజాగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది.. బిగ్‌ బాస్‌ 3 నిర్వాహకులు తనకు అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ సినీ నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్వేతారెడ్డితో కలిసి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన గాయత్రి గుప్తా పోలీసులకు కంప్లయింట్ చేశారు. బిగ్‌బాస్‌ 3 నుంచి నిర్వాహకులు ఫోన్‌ చేసి నటించేందుకు సిద్ధమా అని అడిగారని.. ఆ తర్వాత ఆ టీమ్‌కు సంబంధించిన మరి కొంత మంది వ్యక్తులు తమ ఇంటికి వచ్చి అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారని గాయత్రి చెప్పారు. 

ఈ మేరకు తాను సినిమాలు కూడా వదులుకున్నానని తెలిపారు. అయితే తనను అసభ్యకరమైన రీతిలో కమిట్‌మెంట్‌ అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఫోన్‌ చేసి తనకు ఛాన్స్‌ రాలేదని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్‌ బాస్‌ షోలో సెలక్ట్‌ అయ్యానని చెప్పడంతో ఆరు సినిమాల్లో ఛాన్స్‌లు వదులుకున్నానని తనకు జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ కూడా చేయలేదని గాయత్రి గుప్తా ఫిర్యాదులో పేర్కొన్నారు. 

షోను రక్తి కట్టించేందుకు పాపులర్ పర్సనాలిటీలతో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయినవారికి బిగ్ బాస్ హౌజ్ లోకి అవకాశం కల్పిస్తారు. బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ తో కంటెస్టెంట్లకు మరింత పాపులారిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ క్రేజ్ నే బిగ్ బాస్ కో-ఆర్డినేటర్లు, ప్రొడ్యూసర్లు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌కి కంటెస్టెంట్ వీక్‌గా ఉండటంతో ఆ ప్రభావం రేటింగ్స్‌పై పడింది. 

ఈసారి అలాంటి తప్పులు జరగకుండా.. ఆటను రక్తికట్టించగలిగే సెలబ్రిటీలను బిగ్ బాస్ హౌస్‌కి తీసుకువస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే కాంట్రివర్శిలు చేసి ఫేమస్ అయ్యారో వాళ్ళనే సంప్రదించించారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఇదంతా న‌మ్మ‌డానికి లేద‌ని కావాల‌నే కాంట్ర‌వ‌ర్సీ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేసి పాపుల‌ర్ కావాల‌ని చేస్తున్నారంటూ వాళ్ల‌పైన ఎదురు దాడి కూడా జరుగుతోంది.

 తాజాగా స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకున్న కత్తి మహేష్ ఈ విషయం మీద కామెంట్స్ చేశారు.  బిగ్ బాస్ హౌస్‌కి వస్తే 100 రోజుల పాటు సెక్స్ లేకుండా ఉండగలరా? అని నిర్వాహకులు అడగడంలో తప్పేం లేదని కత్తి మహేష్ అంటున్నాడు. అంతేకాదు గాయిత్రి గుప్తను ‘యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయి’ అని కూడా ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఆయన ఏమని పోస్ట్ చేశారంటే 
‘2017 లో.. 
బిగ్ బాస్ టీం: 70 రోజుకు సెక్స్ లేకుండా ఉండగలరా? 
నేను: బాత్రూమ్ లో కెమెరాలు ఉండవుగా! పర్లేదు మ్యానేజ్ చేసుకుంటాను. 

ఇదే ప్రశ్న , ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పడు 2019లో అడిగితే తప్పైపోతుందా? జస్ట్ ఆస్కింగ్! అని పోస్ట్ చేశారు ఆయన.  అయితే ఈ విషయాన్ని ఒక ఫీమెల్ కంటెస్టెంట్ని అడగకూడని గాయత్రి అంటుంటే లేదు అడిగితే తప్పేంటని కత్తి మహేష్ అడుగుతున్నారు. అయితే ఈ విషయం మీద మాత్రం బయటకి వచ్చి కంప్లైంట్ చేసిన వారిదే తప్పన్నట్టు కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు కూడా. 

ఒక ఆడపిల్లను అలా అడగొచ్చా ? అంటే ఏమని చెప్పగలం గేమ్ ఆడించే వారి రూల్స్ వారికి ఉంటాయేమో ?. ఈ వివాదాలు రాకుండా ఆ అగ్రిమెంట్ చేసే టీమ్ లో ఒక మహిళని పెట్టుకుని వారి చేత లేడీస్ ని ఈ ప్రశ్న వేయించి ఉంటే సరిపోయేది. అయితే రెండు సీజన్లు ఎటువంటి ఆరోపణలు లేకుండా సాగిన ఈ షో మీద వీరు కామెంట్ చేయడం వలన నష్టం వీరికా ? బిగ్ బాస్ కా ? పాపులర్ అయ్యేది బిగ్ బాసా ? ఈ ఇద్దరా ?