చెన్నైకి వణుకుపుట్టించిన రాజస్థాన్

IPL 6: Chennai beat Rajasthan in thrilling chase to go top of the table, IPL 6 Chennai Super Kings beat Rajasthan Royals by five wickets, IPL 6 Watson century in vain as CSK beat Rajasthan by 5 wickets, IPL 6 Hussey, Bravo take Chennai Super Kings past Rajasthan

 

ఐపిఎల్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ X రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆఖరి బంతివరకూ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక బంతి మిగిలి వుండగానే 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ మొదటి నుండే దూకుడు ప్రదర్శించింది. తొలి వికెట్ కు ఓపెనర్ షేన్ వాట్సన్మ్ అజ్నింకా రహానే 71 పరుగులు జోడించారు. రహానే 15 బంతుల్లో 16 పరుగులు (1 బౌండరీ) చేసిన తరువాత అశ్విన్ క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ కు పంపాడు. వాట్సన్ కు జతకలిసిన యాజ్ఞిక్ 7ను కూడా అశ్విన్ కాట్ అండ్ బౌల్ ద్వారా వెనక్కి పంపాడు. రాజస్థాన్ కెప్టెన్ ద్రావిడ్ (6) క్రీజ్ లోకి వచ్చినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. డ్వేన్ బ్రావో వేసిన బంతికి కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన స్టువర్ట్ బిన్నీ వాట్సన్ కు చక్కటి సహకారం అందిస్తూ దూకుడుగా ఆడాడు. బిన్నీ 22 బంతుల్లో 36 పరుగులు (3 బౌండరీలు 1 సిక్సర్) నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ షేన్ వాట్సన్ ఒకవైపు వికెట్లు పడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడాడు. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న వాట్సన్ 60 బంతుల్లోనే సెంచరీ పూర్తీ చేసుకున్న తరువాత డ్వేన్ బ్రావో బౌలింగ్ లో భారీ షాట్ కొట్టబోయి ఎక్స్ ట్రా కవర్ లో హస్సీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ దారి పట్టాడు. ఐపీఎల్-6 లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. బ్రాడ్ హాడ్జ్ 9 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. అశ్విన్ 2, డ్వేన్ బ్రావో 2 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యం భారీగా ఉండడంతో మొదటి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ మురళీ విజయ్ 3 చండీలా కాట్ అండ్ బౌల్ నిరాశ పరిచినా మైక్ హస్సీ చెలరేగి ఆడాడు. మైక్ హస్సీకి సురేష్ రైనా తోడవడంతో వీరిద్దరూ 61 బంతుల్లోనే 90 పరుగులు జోడించారు. సురేష్ రైనా 35 బంతుల్లో 51 పరుగులు (4 బౌండరీలు 2 సిక్సర్లు) చేసి ఫాల్కనర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. చెన్నై కెప్టెన్ ధోని, హస్సీతో కలిసి మూడో వికెట్ కు 42 జోడించిన తరువాత 19వ ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించిన ధోని, ఫాల్కనర్ బౌలింగ్ లో స్టువర్ట్ బిన్నీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మైక్ హస్సీ 51 బంతుల్లో 88 అప్రుగులు (13 బౌండరీలు 1సిక్సర్) చేసిన తరువాత ద్రావిడ్ స్ట్రైట్ త్రో తో రనౌట్ అవుట్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే 'సర్' రవీంద్ర జడేజా 0 పరుగులకు ఫాల్కనర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా బ్రేవో 9 బంతుల్లో 15 పరుగులు (1 సిక్సర్) 20వ ఓవర్ ఐదవ బంతికి భారీ సిక్సర్ కొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి విజయం సాధించింది. ఫాల్కనర్ 3, చండీలా 1 వికెట్లు తీశారు. షేన్ వాట్సన్ సెంచరీ వృధా అయ్యింది. షేన్ వాట్సన్ ఆస్ట్రేలియన్ సహచరుడు మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు విజయాలు నమోదు చేసినప్పటికీ రన్ రేట్ ఆధారంగా చెన్నై ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టేబుల్ టాప్ గా నిలిచింది.