నేడు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు

 

 

 

ఇంటర్ మొదటి సంవత్సరం ఫరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు సోమవారం ప్రకటించనుంది. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాల సీడీని విడుదల చేస్తారు. ఈ పరీక్షా ఫలితాలను http://examresults.ap.nic.in, www.manabadi.com, www.vidyavision.com, www.apit.ap.gov.in, www.exametc.com తదితర వెబసైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ద్వారా 1100కు, ఇతర ల్యాండ్ లైన్, మొబైల్ ద్వారా 1800-425-1110 నంబర్లకు డయల్ చేయడం ద్వారా మీ సేవ కేంద్రాల నుంచి ఫలితాలను తెలుసుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు.


ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల నుంచి ఫలితాలను పొందవచ్చని, 58888 నెంబర్ డయల్ చేయడం ద్వారా ఇంటరాక్టివ్ వాయిస్ ద్వారా ఫలితాలను పొందవచ్చని తెలిపారు. ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలను తెలుసుకోవాలంటే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు inter అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్ నంబర్ టైప్ చేసి 533346కు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. మిగతా నెట్‌వర్క్ నుంచి IPE1 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టిక్కెట్ నంబర్‌ను టైప్ చేసి 54242కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చని ఇంటర్ బోర్డు ఆ ప్రకటనలో తెలిపింది.