భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..ఏడాదిలో రెండో భారీ నష్టం..

 

ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆశ్యర్యకరమైన విషయం  ఏంటంటే..ఈఏడాది అతి పెద్ద రెండో భారీ నష్టం ఇదే అని చెబుతున్నారు నిపుణులు. 26 వేల 818 వ‌ద్ద ముగిసిన‌ సెన్సెక్స్ ఇవాళ 700 పాయింట్లు న‌ష్ట‌పోయింది. మ‌రో వైపు 8 వేల 295 వ‌ద్ద నిలిచిపోయిన నిఫ్టీ 231 పాయింట్లు ప‌డిపోయింది. రెండ‌వ క్వార్ట‌ర్‌లో ఎస్‌బీఐ లాభాలు ప‌డిపోవ‌డంతో ఇవాళ ఆ బ్యాంకు షేర్లు మూడు శాతం ప‌డిపోయాయి. ఎస్‌బీఐతో పాటు ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఎస్ బ్యాంక్‌, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, కెన‌రా బ్యాంక్ షేర్లు కూడా ప‌త‌నం అయ్యాయి.