వివేకం లేని విద్య ఎవ్వరికీ ఉపయోగం?

సమాజంలో విద్య పాత్ర చాలా గొప్పది. విద్య కలిగినవాడి మార్గం వేరుగా ఉంటుంది. జీవితంలో గొప్ప ఉద్యోగ అవకాశాలను పొందాలి అంటే విద్య కూడా గొప్పగానే ఉండాలి.  మనిషి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి విద్య చాలా అవసరం. విటువలులేని విద్య వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం! విజ్ఞానం ద్వారా మానవాళికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుత సమాజంలో విలువలతో కూడిన విద్య సమాజానికి చాలా అవసరం. కానీ ఎక్కడా విలువలు అనేవి విద్యలో అంతగా కనిపించడం లేదు. కారణం విద్యను ఒక వ్యాపారంగా మార్చేయడం. విద్య అనేది ప్రగతిశీలకంగా చైతన్యంగా ఉన్నప్పుడే విద్యకు విలువ అనేది ఉంటుంది. భవిష్యత్ కార్యక్రమాలకు కూడా విద్య ద్వారా అందే ఫలాలు అందరికీ చేరతాయి. కొంతమంది విద్యాలయాల్లో కాకుండా స్వతంత్రంగా చదివి పైకి వచ్చినవారు ఉన్నారు. దూరవిద్య, ఓపెన్ యూనివర్శిటీల ద్వారా ముందుకు సాగుతూ ఉన్నారు కొందరు. విద్య అనేది వివేకాన్ని ఇవ్వాలి. వివేకం లేని విద్య ఎవ్వరికీ ఉపయోగపడదు. ఎందుకంటే అందరూ విద్యా వంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. విద్యారంగం విస్తరింపబడుతుంది. దేశ ప్రగతికి, సమాజ శ్రేయస్సుకూ సాంకేతిక వృత్తి, వైద్య విద్యా రంగాలకు ప్రాధాన్యం ఇవ్వ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందరూ దీనిని ముక్త కంఠంతో ఆమోదిస్తున్నా అమలుచేయడంలో మాత్రం అలసత్వమే ఎదురవుతోంది. అర్హతలు లేనివారు అందలం ఎక్కటం, విలువలు తక్కువైన విద్య, గుర్తింపు లేని విద్యాలయాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.  మేధావులు సలహాలూ సంప్రదింపులూ లేకుండా, కేవలం కార్యనిర్వాహక పదవులలో ఉన్నవారు. చేసే నిర్ణయాల వల్ల హాని జరుగుతుందని గుర్తించే నాటికి జరగవలసిన హాని జరిగిపోతుంది. అందుకే ఎక్కడ చూసినా అర్హత లేనివాళ్ళు ఉంటున్నారు. ప్రభుత్వనేతల రాజకీయాల ప్రాతిపదికతో కాకుండా ప్రతిభ ఆధారంగా, సమర్థులను ఈ రంగంలోకి తీసుకువస్తే విద్యా వ్యవస్థలో మార్పులకు అవకాశం ఉ ఉంటుంది. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే బోధనా కార్యక్రమంతోనే విద్య యొక్క పరమావధి పూర్తిగా నెరవేరింది అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే వ్యక్తిగత అనుభవాల ద్వారా, ప్రపంచ జ్ఞానం ద్వారా, అలవాట్ల ద్వారా కూడా విద్య సమకూరుతుంది. ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికి, ఆలోచనా పరిధిని పెంచుకోవటానికి విద్య ఉపయోగపడాలి. విద్య మనకు వినయాన్ని, సంస్కారాన్ని ఇవ్వాలి. విద్య ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్వహణా సమర్ధ్యం, నాయకత్వ పటిమ పెంపొందాలి. విద్య అనేది సమగ్ర వ్యక్తిత్వానికి పునాదిగా నిలవాలి. విలువలు లేని విద్య నిరర్ధకము. విద్యతో పాటు విలువలు కూడా నేర్చుకోవాలి. విద్యావంతులైన యువతీ యువకులు విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వశాంతికి, సమాజ వికాసానికి, దేశాభివృద్ధికి కృషి చేస్తూ  తమ ఉన్నత విద్య ద్వారా విదేశాలలో సైతం గౌరవం, ఆదరణ పొందాలి. విద్య ద్వారా సంస్కారవంతులు, గుణవంతులైన వారు తయారౌతారు విద్య జీవనోపాధిగా ఉండటమే కాక, జీవన పరమావధిగానూ ఉండాలి. అందుకే విద్య వస్తే సరిపోదు. దానికి విలువలు ముఖ్యం.                                         ◆నిశ్శబ్ద.
Publish Date: Apr 18, 2024 6:30PM

మీ మొహాలు మండ.. గవర్నర్ ఫోనూ ట్యాప్ చేశారా?

ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు. ఈ వేస్టుగాళ్ళు చేసిందే నీచ నికృష్టమైన పని. దాంట్లో కూడా పరిధులు దాటిపోయి ఎంత దారుణానికి దిగారనేది తెలుస్తుంటే రక్తం మరిగిపోతోంది. రాజకీయ కారణాలతో ప్రతిపక్షాల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారయ్యా అంటే, సర్లే, ఇది కూడా రాజకీయంలో ఒక భాగం అని సరిపెట్టుకోవచ్చు. అలాగని ఇది నేరం కాకుండా పోదనుకోండి. అలా కాకుండా ఈ త్రాష్టులు ప్రతిపక్ష రాజకీయ నాయకులతో ఆగకుండా సొంత పార్టీ వారి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. అక్కడతో ఆగారా... ఆగితే వీళ్ళు మనుషులెలా అవుతారు? సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు.. ముఖ్యంగా ఇంటి ఇల్లాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. అక్కడతో ఆగినా వీళ్ళను మనుషుల్లో వున్న పిశాచాలుగా భావించి క్షమించే అవకాశం వుండేది. ఈ నికృష్టులు మరింత అడ్వాన్స్ అయిపోయి సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి కాపురాల్లో నిప్పులు పోశారు. సమాజంలో ఉన్నత వర్గాల వారి ఫోన్లను ట్యాప్ చేసి, వాళ్ళ వ్యక్తిగత రహస్యాలను తెలుసుకుని, బ్లాక్ మెయిల్‌కి పాల్పడ్డారు.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లేటెస్ట్.గా బయటపడ్డ మరో ఘోరం ఇంకో ఎత్తు. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఫోన్‌ని కూడా ఈ బేవర్సోళ్ళు ట్యాప్ చేశారట. ఆ విషయాన్ని ఆమె తాజాగా బయటపెట్టారు. ఆమె గవర్నర్‌గా వున్న సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమాత్రం ప్రొటోకాల్‌ని పాటించకుండా ఆమెను అనేక అవమానాలకు గురిచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఇతర ముఖ్య నాయకులు తమిళిసైని ఎంతమాత్రం లెక్కచేయకుండా మాట్లాడేవాళ్ళు. తాచుపాము బుస కొట్టడం చూసి, వానపాము కూడా బుసకొట్టిందట. ఇదే తరహాలో బీఆర్ఎస్‌లోని గల్లీ లీడర్ల లాంటివాళ్ళు కూడా గవర్నర్‌కి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆ మహాతల్లికి ఓర్పు ఎక్కువ కాబట్టి వీళ్ళ తీరుమీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేయకుండా నెట్టుకొచ్చింది. అయితే 2022లోనే ఆమె తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఆ ఆరోపణలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఆ ఆరోపణలను విన్నవారు ఆమె రాజకీయ కోణాలతో ఇలాంటి ఆరోపణ చేసి వుండవచ్చని భావించారు. అయితే ఇటీవలి కాలంలో బయటపడ్డ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గమనించిన తమిళిసై మరోసారి తన ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు జరుగుతోంది కాబట్టి, తాను గతంలో చేసిన ఆరోపణలకు బలం చేకూరిందని ఆమె అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, సాక్షాత్తూ రాష్ట్రపతికి, రాజ్యాంగానికి ప్రతినిధి అయిన గవర్నర్ ఫోన్‌ని ట్యాప్ చేశారంటే, అలా చేసిన వాళ్ళని, అలా చేయడానికి ఆదేశాలు జారీ చేసిన వాళ్ళని పాత చెప్పుని పేడలో ముంచి కొట్టాలి. 
Publish Date: Apr 18, 2024 5:13PM

విజయోత్సవాన్ని తలపించిన లోకేష్ నామినేషన్ ర్యాలీ

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు. లోకేష్ నామినేషన్ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మిద్దెసెంటర్, వైష్ణవి కళ్యాణమండపం, పాతబస్టాండు మీదుగా సాగిన నామినేషన్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించిందని మంగళగిరి వాసులు చెబుతున్నారు.  ర్యాలీ సందర్భంగా  డిజె సౌండ్లు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో మంగళగిరి పట్టణం మోతెక్కిపోయింది. కాగా తండ్రి   మంగళగిరి తెలుగుదేశం సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బిజెపి సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో లోకేష్ తరఫున  2సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు ముందు మంగళగిరి శ్రీ సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలతో కూటమి నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం బయట సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీగా    మంగళగిరి మిద్దె సెంటర్, వైష్ణవి కల్యాణమండపం, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కూటమికి చెందిన ఎస్సీఎస్టీ, బీసీ మైనారిటీ నేతలు లోకేష్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.  
Publish Date: Apr 18, 2024 3:51PM

తెలుగుదేశం కూటమి జోరు.. వైసీపీ బేజారు!

ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది.   ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది.  ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే  నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.  సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఏపీలో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది.  గురువారం దశమి కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు.  25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలను ఏప్ిల్ 26,  ఉపసంహరణకు తుదిగడువు ఏప్రిల్ 29.  మే 13న పోలింగ్ ,  జూన్‌ 4వ తేదీన ఫలితాలు. ఇదంతా పక్కన పెడితే రాష్ట్రంలో నేటి నుంచి అన్ని రకాల ప్రీపోల్, పోస్ట్ పోల్ అంటే ఎగ్జిట్, ఒపినియన్ పోల్ లకు, సర్వేలకు ఈ రోజుతో చుక్క పడింది. అంటే ఫుల్ స్టాప్ పడింది. నే అన్ని రకాల సర్వేలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక నుంచి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించ కూడదు.  ప్రీ-పోల్‌ సర్వే కానీ, ఒపినియన్‌ పోల్‌ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించ కూడదు. జూన్‌ 1న మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. అంటే ఇప్పటి వరకూ వెలువడిన పది పదకొండు సర్వేలు మినహాయిస్తే ఇక నుంచి మళ్లీ జూన్ 1వ తేదీ అంటే సార్వత్రిక ఎన్నికల తుది దశ ముగిసే వరకూ ఎటువంటి సర్వేలూ వెలువడే అవకాశం లేదు.  ఇప్పటికే వెలువడిన సర్వేలన్నీ ఏపీలో ఎలక్షన్ వార్ వన్ సైడేనని తేల్చేయడం, తెలుగుదేశం కూటమి ఘన విజయం తథ్యమని పేర్కొన్న నేపథ్యంలో కూటమి ప్రచారంలో దూకుడు పెంచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరో వైపు వైసీపీ కూటమిలో గుబులు కనిపిస్తున్నది. జగన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి బస్సు యాత్రకు జన స్పందన కరువు అవ్వడం, జగన్ వినా ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయగలిగే ప్రభావమంతమైన క్యాంపెయినర్లు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. బొత్స, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి వంటి కీలక నేతలు సైతం తమ నియోజకవర్గంలో విజయం కోసమే చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉండటంతో పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ల కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజాగా శిరోముండనం కేసులో ఆ పార్టీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.  అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ పై తీర్పు ఈ నెల 23న వెలువడ నుంది. ఒక వేళ అవినాష్ బెయిలు రద్దైతే వైసీపీకి కడపలో కూడా ఇబ్బందులు తప్పవు. అదే విధంగా జగన్ పై గులకరాయి దాడి సెంటిమెంట్ ను రగల్చడం సంగతి అటుంచి మొత్తంగా పార్టీ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా నవ్వుల పాలు చేసింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమికి దీటుగా వైసీపీ ప్రచారం జోరు పెంచే అవకాశాలు కనిపనించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Apr 18, 2024 2:51PM

మోడీ ఫస్ట్.. బీజేపీ నెక్ట్స్!

కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ... బీజేపీని మించి ఎదిగిపోయారా? పార్టీ కంటే ఆయనే ప్రధానం అనే స్థాయికి కమలం క్యాడర్ వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే విశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన  మేనిఫెస్టోను చూసిన ఎవరైనా మోడీ ఫస్ట్, బీజేపీ నెక్ట్స్ అన్నట్లుగానే కమలం పార్టీ పరిస్థితి మారిపోయిందన్న అభిప్రాయానికే వస్తారని అంటున్నారు.  మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలకే పెద్ద పీట వేశారు.   పదేళ్ల కాలంలో మోడీ సర్కార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను  కొనసాగిస్తామనీ,  జి.ఎస్‌.టి వంటి సంస్కరణలు, ఆర్టికల్‌ 370ని రద్దు  వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రాథమిక సదుపాయాల కల్పనకు మోడీ ఇచ్చిన ఇచ్చిన ప్రాధాన్యత,   సమాజంలోని ప్రతి వర్గానికి తాము అందజేసిన లబ్ధి వంటి వాటిని మోడీ ఘనతలుగా మేనిఫెస్టోలో పేర్కొన్నారు.  మూడవసారి కూడా  మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అ ధికారంలోకి రావ డం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు, మరో అయిదేళ్ల పాటుబియ్యం ఉచితంగా సరఫరా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు బీజేపీ మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొన్నారు.   ఉమ్మడి పౌర స్మృతిని, ఒకే దేశం-ఒకే ఎన్నికలు తదితర అంశాలను అమలు చేస్తామనడమే కాకుండా, బులెట్‌ రైళ్లు,  వందే భారత్‌ రైళ్ల సంఖ్యను పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, పేదలకు మూడు కోట్ల గృహాల నిర్మాణం, పైపుతో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా, మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నట్టు   ప్రకటించారు. ప్రధానంగా హిందుత్వ అజెండానే పొందుపరిచారు. దాదాపుగా బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మోడీ గత పదేళ్లుగా తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకునేందుకు చేసిన ప్రకటనలు వాగ్దానాలే అనడంలో సందేహం లేదు. అయితే దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంపన్న, పేదల మధ్య పెరిగిన అంతరం, రైతుల ఆదాయం రెట్టింపు కావడం అటుంచి, వారి కష్టాలు మరింత పెరగడం వంటి అంశాల జోలికి బీజేపీ మేనిఫెస్టో పోలేదు. ఈ మేనిఫెస్టోలో ఆ దిశగా ఎటువంటి వాగ్దానాలూ లేవనే చెప్పాలి.  ఉద్యోగాలను సృష్టిం, రైతుల ఆదాయం రెట్టింపు వంటి గత వాగ్దానాల గురించిన ప్రస్తావనే లేదు.  దీంతో బీజేపీ పార్టీగా కంటే మోడీని మరింత ఫోకస్ లోకి తీసుకురావడం మీదనే ఎక్కువ దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 18, 2024 2:31PM

జనసేనకు జబర్దస్త్ ప్రచారం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు. జగన్ హయాంలో తెలుగు సినీ పరిశ్రమ నిస్సందేహంగా ఎన్నో ఇబ్బందులకు గురైంది. సినిమా టికెట్ల ధరల విషయంలో కానీ, సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలకు అనుమతుల విషయంలో కానీ జగన్ సర్కార్ ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేసింది. జగన్ కు మొదటి నుంచీ కూడా సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న భావన ఉంది. తాను సీఎం అయిన సందర్భంలో సినీ పరిశ్రమ పెద్దలు ఎవరూ తనను అభినందించలేదన్న కోపం కూడా మనసులో పెట్టుకున్నారని సినీ వర్గాల సమాచారం. ఆ కారణంగానే పరిశ్రమ పెద్దలను తన గెప్పెట్లో ఉంచుకోవాన్న ఉద్దేశంతోనే సినిమా టికెట్ల ధరల నియంత్రణ పేరుతో రాష్ట్రంలో పెద్ద సినిమాలు  ఒకటి రెండు రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టుకునే విధానానికి ఆయన కళ్లెం వేసినట్లు కనిపిస్తున్నారు. అలాగే కొత్త సినిమాల బెనిఫిట్ షోలకు కూడా కళ్లెం వేయడంతో పరిశ్రమ పెద్దలు ఆయన వద్దకు వెళ్లి మరీ అభ్యర్థించిన సంగతి తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి నెయ్యం కోరుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరినా ఫలితం లేకపోయిన సంగతి తెలిసిందే.  అయితే జగన్ సర్కార్ విషయంలో సినీ పరిశ్రమలోని పెద్దలు ఆర్థిక నష్టాల భయంతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల విషయంలో ఒకరిద్దరు వినా మొత్తం పరిశ్రమ సైలెంటైపోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   ఈ నేపథ్యంలో జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న కొందరు నటులు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ప్రచారం చేయడానికి ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.     జబర్దస్త్ నటులు రాంప్రసాద్, గెటప్ శీను అనకాపల్లి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అనకాపల్లి రూరల్ మండలంలోని బీఆర్టీ కాలనీలో వీరు ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.  
Publish Date: Apr 18, 2024 1:32PM