రాజ్ కోట్ వన్డేలో ఓడిన భారత్

Publish Date:Jan 12, 2013

 

 

India`s woes continue as they lose by nine runs in 1st ODI, India vs England 2013, India v England 1st ODI as it happened

 

 

రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే లో ఇండియా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి నష్టానికి 316 పరుగులు చేసింది. 326 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కి దీగిన భారత్ ఓపెనింగ్ జోడి చాల రోజుల తరువాత మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అజింక్యా రహనే 47 పరుగులు చేయగా, ఆ తర్వాత గంభీర్ 52 పరుగులు చేసి అవుటయ్యాడు.యువరాజ్ సింగ్, సురేష్ రైనా, గంభీర్ అర్థ సెంచరీలు చేసినా ఇండియాను గెలిపించలేకపోయారు. ట్రెడ్‌వెల్ నాలుగు వికెట్లు తీసి భారత్ దెబ్బ కొట్టాడు. భారత్ ఓడిన చివరి వరకు పోరాడింది.

 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, ఇయాన్ బెల్ ఇండియా బౌలర్లను ఆటాడుకున్నారు. మొదటి వికెట్ కి వీరిద్దరూ 158 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఇయాన్ బెల్ (85) పరుగులు చేయగా, అలిస్టర్ కుక్ (75) పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆతరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇయాన్ మోర్గాన్, పీటర్సన్‌లు బాగా ఆడినప్పటికీ అర్ధసెంచరీలలు చేయలేక పోయారు.మోర్గాన్(41), పీటర్సన్(44) పరుగులు చేసి అవుటయ్యారు. అనతరం బ్యాటింగ్ కు దీగిన పటేల్, క్రెయిగ్ కీష్టెట్టర్ ఇండియా బౌలర్లను అదరగొట్టారు. పటేల్ 20 బంతుల్లో 44 పరుగులు చేశారు. క్రెయిగ్ కీష్టెట్టర్ 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.