కోడలిని రేప్ చేసిన మామ..

మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతోంది. ఇంటి బయటే కాదు. ఇంట్లోనూ భద్రత కరువైంది.అమ్మాయిలు ఇంట్లో నుండి ఒంటరిగా బయటికి వెళ్లాలంటే సొంత వాళ్ళు తోడు వెళ్లాల్సిన సమాజంలో బతుకుతున్నాం. అమ్మాయికి తోడుగా వెళ్లిన ఇంటి మనుషులే తోడేళ్లవుతున్నారు. తండ్రి లా చూసుకోవాలిసిన మామే.. కామంచో కుళ్ళు మూసుకుపోయి సొంత కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఢిల్లీకి చెందిన మామా, కోడలు వస్త్రాల వ్యాపారం చేసేందుకు  హైదరాబాద్ వచ్చారు. ఆ అమ్మాయి మామ ను తన తండ్రితో సమానం అనుకుంది. మామతో కలిసి ఆ యువతి నాంపల్లిలోని ఓ లాడ్జ్‌లో రూం తీసుకొని బసచేసింది.  కోడలి పై కన్నేసిన మామ రాత్రి  కోడలిపై మృగంలా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  తన మామే తనపై బలవంతం చేశాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.