ఛలో అసేంబ్లీ..హై టెన్షన్

 

 Hyderabad on high alert, Chalo Assembly  Telangana,  Telangana Chalo Assembly

 

 

నగరమంతా భారీ కేడ్లు పెట్టేశారు..హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఎంఎంటీఎస్ రైళ్లు ఆపేశారు. అర్ధరాత్రి నుండే రహదారులు ..ఫ్లై ఓవర్లు మూసేశారు. అడుగు అడుగునా సాయుధ పహారా. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలంగాణ వాదులను అరెస్టులు, బైండోవర్లు చేసేశారు. తెలంగాణ ఉద్యోగులు ఎట్టి పరిస్థితులలో ఉదయం 10 గంటలకు తమ తమ కార్యాలయాలకు చేరుకోవాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఛలో అసేంబ్లీకి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో దానిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవి. తెలంగాణ జిల్లాల ఎస్పీలు ప్రత్యేకంగా ఛలో అసేంబ్లీకి అనుమతి లేదు..ఎవరూ వెళ్లవద్దు అని గోడపత్రికలు ముద్రించి అంటించారు. ఎట్టి పరిస్థితుల్లోను ఛలో అసేంబ్లీ జరిపి తీరుతామని తెలంగాణ వాదులు చెబుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏ మలుపు తిరుగుతుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది.