మెట్రో జాబ్‌ గోల

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ శరవేగంగా నడుస్తుంది. అయితే ఇంకా ప్రాజెక్ట్‌ పనులు పూర్తి కాకుండా మెట్రోట్రైన్స్‌లో జాబ్స్‌ కోసం అభ్యుర్దుల ఎదురు చూపులు మొదలయ్యాయి.. 2017 జూలై నుంచి మొదలు కానున్న 72 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే దరఖాస్తూ చేసుకుంటున్నారు అభ్యర్ధులు..

 

ముఖ్యంగా ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌చ ఇండస్ట్రీయల్‌ టెక్నికల్‌ ఇన్సిస్టిట్యూట్స్‌కి సంభందించిన చాలా మంది ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసకుంటున్నారు.. అయితే ఇదే అదనుగా భావించిన బ్రోకర్‌లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జనం నుంచి అందినంత వరకు లాక్కుంటున్నారు..



ప్రాజెక్ట్‌ మొదలు పెట్టే సమయంలోనే 50000 ఉద్యోగాలిస్తామని ప్రకటించిన ఎల్‌ అండ్‌ టి ఇంతవరకు ఓలాంటి జాబ్‌ నోటిఫికేషర్‌ ఇవ్వలేదు.. అయినా  వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.



దీంతో హెచ్‌ఎమ్‌ ఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.. ప్రస్థుతం మెట్రో ప్రాజెక్ట్‌ లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవని బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దని చెపుతున్నారు..