ఫిలిం ఛాంబర్ మీద దాడి

 

హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద శుక్రవారం నాడు కొంతమంది దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు ఆర్.కె.గౌడ్ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈయన దీక్షకు ఎవరూ ప్రతిస్పందించకపోవడం వల్లే ఆయన మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ మీద దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.