సంక్రాంతి దెబ్బకు టోల్ గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు

సంక్రాంతి కి సొంతూళ్ల కు వెళ్లే వారితో పట్నం కాస్త పల్లె బాట పట్టినట్లు తలపిస్తుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. పంతంగి, కొర్లపాడు టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.  ప్రస్తుతం పంతంగి టోల్ గేట్ వద్ద గత రెండు రోజుల నుండి రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు పెద్దఎత్తున బార్లు తీరిన పరిస్థితి నెలకొంది. గత రెండు రోజుల నుండి ఇదే పరిస్థితి కొనసాగడంతో అదనంగా 16 మందిని టోల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారు వాహనదారుల వద్దకే వెళ్లి త్వరత్వరగా పంపిస్తున్నప్పటికి టోల్ గేట్ల వద్ద రద్దీ కొనసాగుతుంది. అయితే పంతంగి టోల్ గేట్ తో పాటు కొర్లపాడు దగ్గర ఉన్న టోల్ గేట్ వద్ద రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా  విజయవాడకు వెళ్లాలంటే ఇటు పంతంగి కావచ్చు అదే విధంగా కొర్లపాడు చిల్లపల్లి టోల్ గేటు వద్ద భారీగా ట్రాఫిక్ ఆగింది. 

సంక్రాంతి పండగ సెలవులు ఉండటంతో వాహనాల రద్దీ ఇప్పటికే లక్ష వరకు వెళ్లినట్టుగా టోల్ సిబ్బంది అధికారుల యాజమాన్యం తెలుపారు. ఇక ముఖ్యంగా ఫాస్ట్ ట్యాగ్ ను తీసుకొని త్వరగా వెళ్లేలా చెప్పారు అధికారులు. ఇలా చేస్తే వాహన దారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. ముఖ్యంగా  ఇప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్ రూట్లకు సంబంధించి పంతంగి టోల్ గేట్ వద్ద 16  లైన్స్ ఉండగా.. ఇందులో పది లైన్లు ప్రధానంగా విజయవాడకు వెళ్లేందుకు ఏర్పాటు చేసారు. అందులో ఫాస్ట్ ట్యాగ్ కు  సంబంధించి ఐదు లైన్ లను వేరుగా పెట్టారు. అయితే వాటిలో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ మిగతా లైన్లలో రద్దీ అయితే కొనసాగుతుంది.