నిర్మలా సీతారామన్ కు తప్పని ఇంటిపోరు!!

 

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ఇంటిపోరు ఎదురవుతోంది. మాంద్యం వేళ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఆమె భర్త పరకాల ప్రభాకర్ కు నచ్చడం లేదు. పివి, మన్మోహన్ విధానాలు పాటించాలని నేరుగానే సలహా ఇస్తున్నారు. వీరిద్దరి మద్య వాగ్వాదం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అవుతోంది. పివి, మన్మోహన్ విధానాలే దేశానికి శ్రీరామరక్ష అని పరకాల ప్రభాకర్ అంటున్నారు. గత ఐదేళ్ళలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం అని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం విరుగుడుకు తీసుకోవలసిన చర్యలపై పరకాల ప్రభాకర్ తన అభిప్రాయంను ఓ ప్రముఖ పత్రికా ఎడిటోరియల్ పేజీకి ఆర్టికల్ రూపంలో వెల్లడించారు.

ఎ లోడ్స్టర్ టూ స్టీర్ ద ఎకానమీ పేరుతో ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు వ్యాసాన్ని రాశారు. చాలా అంశాల్లో అందులో వ్యక్తం చేశారు. దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది, వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని పరకాల విమర్శించారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ విధానాలే బాగున్నాయి. పివి, మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలను బీజేపీ ప్రభుత్వం అనుసరించాలని సలహా ఇచ్చారు. నెహ్రూ ఆర్థిక విధానాల్లో బీజేపీ విమర్శించడాన్ని కూడా పరకాల తప్పుబట్టారు. అధికార పార్టీ చర్య ఆర్ధిక విమర్శగా లేదని రాజకీయ దాడిగానే మిగిలిపోయిందని ఆ విషయాన్ని బిజెపి ఇంకా గుర్తించటం లేదని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా తిరస్కరణ ధోరణిలోనే వెళుతుందని ప్రభాకర్ మండిపడ్డారు.

మోదీ ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖత చూపడం లేదని దేశంలో ఒక రంగం తర్వాత మరో రంగానికి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగం నలభై ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడమే కాకుండా వివిధ రంగాల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని పరకాల ప్రభాకర్ కేంద్రంపై ఓ స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజానికి పరకాల ప్రభాకర్ మాత్రమే కాదు, నిన్నటికి నిన్న నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న అభిషేక్ బెనర్జీ అప్పుడెప్పుడో ఇదే ఘనత సాధించిన అమర్త్యసేన్ రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇలాంటి ప్రముఖులెందరో కేంద్ర ప్రభుత్వ విధానాలని విమర్శించారు. వారితో పోలిస్తే పరకాల అభిప్రాయాలకు పెద్దగా విలువ ఇవ్వాల్సిన పనిలేదు. కానీ నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ అనే హోదా ముందుకొస్తోంది, ఆ కారణంగానే హాట్ టాపిక్ అవుతోంది.