బాధితుల ఇంటికి ఉచితంగా కరోనా కిట్

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా.. వారికి కావాల్సినవాటిని ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టాయి. 

కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగులను హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే.. వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి.

హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'కోవిడ్ హోమ్ క్వారంటైన్ కిట్' ను ఏపీ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఆక్సీమీటర్ ఉంటాయి.

హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'హోమ్ ఐసోలేషన్ కిట్' ను తెలంగాణ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో 17 రోజులకు సరిపడే మెడిసిన్ ఉంటుంది.  అలాగే, మాస్కులు, శానిటైజర్లతో పాటుగా కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను గురించి వివరించే ఓ చిన్న బుక్ కూడా అందులో ఉంటుందట.