మసీదు కూల్చి ఉండకపోతే ఈ తీర్పు వచ్చేదే కాదు... తీర్పుపై అసదుద్దీన్ ఓవైసి అసంతృప్తి 

 

అయోధ్య తీర్పు పై అసంతృప్తితో పాటు ఘాటైన విమర్శలు చేసిన అసదుద్దీన్ పై మధ్యప్రదేశ్ లో కేసు నమోదైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడం పై పవన్ అనే వ్యక్తి జహంగీర్ బాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ చేసిన వ్యాఖలను పరిశీలించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. నాడు మసీదు కూల్చి ఉండకపోతే ఇవాళ ఈ తీర్పు వచ్చి ఉండేదే కాదంటూ విమర్శించాడు అసద్. అప్పటి రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు విఫలమయ్యారని తీవ్ర వ్యాఖలను చేసాడు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామంటూనే అదేమీ సర్వోన్నతమైన తీర్పు కాదని ద్వంద్వ నాలుకను ప్రదర్శించాడు. అయోధ్యలో మసీదు కోసం ఐదు ఎకరాల కేటాయించాలన్న తీర్పుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పోరాటం మసీదు కోసమే కానీ భూమి కోసం కాదు అన్నారు. తమకు ఎవ్వరి సానుభూతి, దానం అవసరం లేదన్నారు అసద్.

అసద్ చేసిన కామెంట్స్ పై మధ్యప్రదేశ్ కు చెందిన న్యాయవాది పవన్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశమంతా స్వాగతించిన తీర్పును ఆయన వ్యతిరేఖించటం సబబు కాదని అభిప్రాయపడుతూ జహంగీర్ బాద్ లో కేసు పెట్టారు. ముస్లిం నేతలు ఇది వరకే అసద్ చూసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. నువ్వేమైనా ముస్లింల ప్రతినిధివా అంటూ ప్రశ్నలు సంధించారు. అయినా తన బాట తనదే అనే విధంగా అసద్ అసలు ఎవ్వరిని పట్టిచుకోకుండా మాటలు అంటూనే ఉన్నాడు. అసద్ తమ్ముడు అక్బరుద్దీన్ అప్పటిలో చేసిన వ్యాఖ్యలు వివాస్పదంగా మారిన విషయం అందరికి తెలిసిందే.