టీ జూనియర్ డాక్టర్ల నిరసన ఉద్ధృతం

 

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. జీవో 107ను వెంటన రద్దు చేయాలని జానియర్ డాక్టర్లు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవోను నిరసిస్తూ ఉస్మానియా మెడికల్ కాలేజీ మెట్లపైనే జూడాలు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఉద్యమానికి ఉస్మానియా స్టూడెంట్స్ జేఏసీ కూడా మద్దతు ప్రకటించింది. జూడాల నిరసన కారణంగా ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మొహరించారు. జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలని తెలంగాణ ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. దీనిని నిరసిస్తూ జూడాలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జూడాలు ఆందోళనను విరమించలేదు.