మహబూబ్ నగర్ జిల్లాలో మునిసిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే

మహబూబ్ నగర్ జిల్లాలో రెండు మునిసిపాలిటీల ఎన్నికలపై హై కోర్టు స్టే విధించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవే కీలక మునిసిపాలిటీలు కావడాం గమనర్హం. ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పాలమూరు వాసులకు హై కోర్టు తీర్పు షాకిచ్చినట్లు అయ్యింది. ఓటర్ల జాబితా.. వార్డుల విభజన సరిగ్గా జరగలేదని మహబూబ్ నగర్ వనపర్తికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో ఈ రెండు మునిసిపాలిటీల ఎన్నికల పై హై కోర్టు స్టే విధించింది. జిల్లాలో ఉన్న మొత్తం 19 మునిసిపాలిటీల్లో అచ్చంపేట, జడ్చర్ల ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తి కాకపోవడంతో ఆ రెండింటి ఎన్నికలు నిలిపేశారు అధికారులు.అవికాకుండా మరో రెండు మున్సిపాలిటీల ఎన్నికల్లో నిలిచిపోవడంతో పదిహేను మున్సిపాలిటీలకే ఎన్నికలు జరగనున్నాయని సమాచారం.

ఓటర్ల జాబితాలో గందరగోళం జరగడం వార్డుల విభజన సరిగా జరగలేదని మహబూబ్ నగర్ పట్టణాని కి చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టు లో పిటిషన్ వేశారు. దీంతో వార్డుల విభజన ఓటర్ల జాబితాను సరిచేసుకుని రావాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.ఆదేశాల తరువాత కూడా సరిచేయకపోవడం.. పిటిషన్ మళ్లీ విచారణకు రావడంతో హైకోర్ట్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల పై స్టే విధించింది.వనపర్తి పట్టణానికి చెందిన సమద్ హైకోర్టును ఆశ్రయించారు. మరణించిన వారి ఓట్లు కూడా లిస్ట్ లో ఉండటంతో పాటు వార్డుల రిజర్వేషన్లు సరిగా జరగలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన హై కోర్టు ఈ రెండు మునిసిపాలిటీలకు స్టే విధించింది.