జగన్ పై దాడి కేసు.. చంద్రబాబుకు నోటీసులు

 

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి గురించి హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ విచారణ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో భద్రతాపరమైన లోపాల పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ చేస్తున్న హైకోర్ట్ బెంచ్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను సమర్పించింది. అందులో సిసిటీవీ పుటేజ్ కు సంబందించిన వివరాలు లేకపోవడంపై న్యాయమూర్తులు ప్రశ్నించారు. మూడు నెలలుగా సిసిటీవీలు పనిచేయడం లేదని అదికారులు చెప్పారు. దానిపై న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విఐపిలు ఉండే లాంజ్ లో సిసిటీవీ కెమెరాలు పనిచేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాగా ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు, డిజిపి సహా ఎనిమిది మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ సీఐఎస్ఎఫ్ అధికారికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాలలో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.