భోపాల్ లో హైఅలర్ట్...

 

భోపాల్ లో హైఅలర్ట్ ప్రకటించారు. భోపాల్ సెంట్రల్ జైలు నుండి 8మంది ఉగ్రవాదులు పారిపోగా వారిని ఎన్ కౌంటర్లో హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ పై పలు కథనాలు వస్తున్నాయి. ఇది ఫేక్ ఎన్ కౌంటర్ అని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ హై అలర్ట్ ప్రకటించింది. తమకు సమాచారం ఇవ్వకుండా నాయకులు ఎక్కడికి ప్రయాణించొద్దని పోలీసులు తెలిపారు. అదేవిధంగా వారి భద్రత పెంచినట్టు తెలుస్తున్నది. మరోవైపు భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశమున్నదని, ఈ దాడుల్లో అమెరికా పౌరులను ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ లక్ష్యం చేసుకోవచ్చని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి అని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. సినిమా హాళ్లు, రైళ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామి, హర్కత్ ఉల్ ముజాహిద్దీన్, ఇండియన్ ముజాహిద్దీన్, జైషే మహ్మద్, లష్కరే తోయిబ వంటి ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే అవకాశముందని పేర్కొన్నది.