తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు...

 

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధురై, తిరునెల్వేలి, తిరువల్లూరు, తూత్తుక్కుడి, విరుదునగర్,తేని, రామనాథపురం, వెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఎనిమిది జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తిరుత్తణిలో అత్యధికంగా పధ్ధెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖాధికారులు, మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. 

తమిళనాడులో ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో గత పదిహేను రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అందులోనూ రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు దక్షిణ తమిళనాడు కోయంబత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా ఎగువన కేరళలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా డ్యామ్ లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి గేట్లన్నీ కూడా ఎత్తేసినటువంటి పరిస్థితిలో కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైపోయాయి. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మొత్తం ఇప్పటికే దాదాపు పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతంతో దిండివనంతో పాటు తిరునల్వేలి, తిరువల్లూరు, తూత్తుక్కుడి,తేనె ప్రాంతాల్లో ఈ వర్షం కారణంగా నష్టం అనేది ఎక్కువుగా ఉంది.

మరొక రెండు రోజుల పాటు కూడా అంటే నలభై ఎనిమిది గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి తేలికపాటి వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా జలమయమైనటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటిది రానున్నటువంటి రెండు రోజుల్లో వర్షాలు కురిస్తే కనుక మరింత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సెలవులు రద్దు చేసి అందరూ కూడా విధుల్లో ఉండాలని ఆదేశించారు.

విద్యా సంస్థలకి గడిచినటువటువంటి రెండు రోజులు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సెలవులు మరొక రెండు, మూడు రోజుల పాటు కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దించారు. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జిల్లాలో ఆయా మండల కేంద్రాల్లో అందులోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోనే ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.