విలీనం పై హరీష్ రావు మెలిక

 

 

 harishrao revanth reddy, revanth reddy harish rao, chandrababu telangana

 

 

సమైక్యాంధ్రకు జై కొట్టి, తెలంగాణను అడ్డుకున్నందుకు ముందుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బహిరంగ క్షమాపణ చెబుతూ చెంపలేసుకుంటేనే ఆ పార్టీలో తమ పార్టీ విలీనంపై ఆలోచిస్తామని టీఆర్ఎస్ఎల్పీ ఉప నేత టి.హరీశ్‌రావు స్పష్టంచేశారు. టీడీపీలో టీఆర్ఎస్ విలీనంపై తాను చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి అర్థంకానట్టు ఉందని అన్నారు.

 

"2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన తర్వాత టీడీపీ యూటర్న్ తీసుకోవటం వల్లనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనక్కి వెళ్లింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిందే టీడీపీ.


రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచించిన పార్టీ అది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రెండు నివేదికలు ఇచ్చి.. పార్లమెంటులో సమైక్యాంధ్ర కోసం ప్లకార్డులు పట్టింది. ఈ తప్పులన్నింటినీ చంద్రబాబు ఒప్పుకొని బహిరంగంగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి. రేవంత్‌రెడ్డికి చేతనైతే ఆ పని చేయించాలి. అప్పుడే విలీనంపై మా పొలిట్‌బ్యూరోలో చర్చిస్తాం'' అని చెప్పారు. ఆ తరువాతే మూడు షరతుల గురించిన చర్చలోకి వెళదామని సూచించారు. కాగా, కాంగ్రెస్ నాయకత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. "అది కాంగ్రెస్ కోర్ కమిటీ కాదు.. మహా చోర్ కమిటీ'' అంటూ మండిపడ్డారు.