టిడిపి పై హనుమంతన్న దాదాగిరి

Publish Date:Jun 26, 2013

 

Hanumantha Rao, Uttarakhand floods, Uttarakhand floods news, Uttarakhand floods latest news

 

 

ఉత్తరాఖండ్ వరదలలో తెలుగు ప్రాణులు చిక్కుకొని విలవిలలాడుతుంటే, నా బంగారు తల్లి, నా ఇందిరమ్మ కలలు, నా యస్సీ ఎస్టీ బిల్లు అంటూ రానున్న ఎన్నికలకి వోటు బ్యాంకుకి ఎరలు సిద్దం చేసుకొంటూ తాపీగా కూర్చొన్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అమెరికా నుండి వస్తూనే హుటాహుటిన డిల్లీలో నిలబడి సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టి, విమానంలో ప్రయాణికులను తరలించడం మొదలుపెట్టాక గానీ, ఆ పనులన్నీ ప్రభుత్వం చేయాలని గుర్తుకు రాలేదు ముఖ్యమంత్రిగారికి.


ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి వరద బాధితులను స్వస్థలాలకు తరలించేందుకు టిడిపి తో పాటు కాంగ్రెస్ కూడా విమానాలను ఏర్పాటు చేసింది. అయితే టిడిపి ఏర్పాటు చేసిన విమనాలనే భాదితులు ఎక్కుతుండడంతో కాంగ్రెస్ నేతలు అడ్డుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో ఎక్కాలని బాధితులపై ఒత్తిడి తేవడంతో నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. చివరికి హనుమంతరావు, రమేష్ రాథోడ్ ల మధ్య తోపులాటకు దారి తీసింది. దీంతో సెక్యూరిటీ అడ్డుకొని నేతలను శాంతపరిచారు.

సంఘటన స్థలాల నుంచి బాధితులను తాము తీసుకోనివస్తే...ఎయిర్ పోర్ట్ లో వారిని ప్రభుత్వ విమానాలు ఎక్కాలని చెప్పడం ఏంటని టిడిపి నేతలు ప్రశ్నించారు. ఇటు భాదితులు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.