గిన్నిస్‌ బుక్‌లో హనుమాన్ చాలీసా...

 

హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. గుంటూరు జిల్లా తెనాలిలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో లక్షా 28 వేల 913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ పారాయణానికి గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ పారాయణం కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్‌లో చేరుస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామికి గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.