బాబు మంత్రిగా ఉన్నప్పుడు డైపర్లు వేసుకున్న బచ్చా అఖిలేష్

 

బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు రోజుకొక్కసారైనా టీడీపీ మీద, చంద్రబాబు మీద విమర్శలు చేయడం కామన్ అయిపోయింది. అసలే ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసే పనిలో పడిపోయారు. మరి ఇలాంటి సమయంలో జీవీఎల్ ఊరికే ఉంటారా?. చంద్రబాబు మంత్రిగా పనిచేసినప్పుడు డైపర్లు వేసుకున్న బచ్చా అఖిలేష్ యాదవ్ పిలిస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం సిగ్గుచేటు అంటూ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

'చంద్రబాబు నాయుడు గారు 1978 లో MLA,1980 లో మంత్రి అయ్యారు. అప్పుడు 5 ఏళ్ల వయసున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వయసు వాడు. అందరి కంటే సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబుకి 'బచ్చా' అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్ళటం సిగ్గనిపించటం లేదా? ఇది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా?' అంటూ చంద్రబాబు ఫోటో జత చేసి జీవీఎల్ ట్వీట్ చేశారు.